Site icon NTV Telugu

Chandrababu Kuppam Tour: కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన.. ఏం జరుగుతోంది..?

Chandrababu

Chandrababu

ఆంక్షలు, అడుగడునా అడ్డంకుల మధ్య తన సొంత నిజయోకవర్గం కుప్పంలో పర్యటిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన పర్యటన రెండో రోజుకు చేరుకుంది.. ఇవాళ కుప్పం పార్టీ కార్యాలయంలో పార్టీ కేడర్ తో సమావేశం కానున్నారు.. నిన్నటి ఘటన నేపథ్యంలో న్యాయ పోరాటం చేస్తానని ఇప్పటికే ప్రకటించారు చంద్రబాబు.. అయితే, అధినేత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.. ప్రచారరథం ఇవ్వకుంటే ధర్నాకు దిగుతానని నిన్న హెచ్చరించారు చంద్రబాబు.. శాంతిపురం మండలం కెనుమాకులపల్లిలో రచ్చబండ వద్ద గ్రామస్థులతో చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు రానున్న ఎన్నికలతో ముడిపడి ఉందన్నారు.. వైసీపీలోనూ నష్టపోయిన వారున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆయన.. ఆ పార్టీ ఎమ్మెల్యేల్లోనూ తిరుగుబాటు వస్తోందన్నారు.. వైఎస్‌ జగన్ రెడ్డి పాలనలో పోలీసులు కూడా సైకోల్లా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో జగన్ పాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. కుప్పం పర్యటనలో పోలీసుల తీరుపై న్యాయ పోరాటం చేయడమే కాదు తగిన బుద్ది చెబుతామని హెచ్చరించారు..

Read Also: Astrology : జనవరి 05, గురువారం దినఫలాలు

అయితే, ఇవాళ పూర్తిగా పార్టీ క్యాడర్ తో భేటీకి సమయం కేటాయించారు చంద్రబాబు నాయుడు.. కుప్పంలోని పార్టీ కార్యాలయంలో బూత్‌ల వారీగా కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు వరుస సమీక్షలు నిర్వహించనున్నారు.. షెడ్యూల్ ప్రకారం పార్టీ కేడర్ తో సమావేశాలు ఉంటుందా లేక లేకుంటే నిన్నటి పరిణామాలు నేపథ్యంలో ఇవాళ ఆయన కార్యక్రమాల షెడ్యూల్ మారుతుందా అన్నదానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. చంద్రబాబు రెండో రోజు పర్యటన ఎలా సాగుతుంది..? పోలీసులు ఎలాంటి ఆంక్షలు పెడతారు? ఆయన ముందుకు ఎలా వెళ్తారు? అనేది ఆసక్తికరంగా మారింది.

Exit mobile version