NTV Telugu Site icon

AP-Telangana Rains: ఏపీ, తెలంగాణల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్..

Ap Telangana Rains

Ap Telangana Rains

AP-Telangana Rains: తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. మే 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, మే 24 నాటికి అది బలపడి వాయుగుండంగా మారుతుందని, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు సముద్ర మట్టానికి 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి ఆవరించి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం తమిళనాడు ఉత్తర ప్రాంతం వరకు విస్తరించి ఉండగా, మే 23 వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.తెలంగాణతో పాటు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆంధ్ర. నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. దక్షిణ అండమాన్ సముద్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వివరించింది. ఇవాల నైరుతి రుతుపవనాలు బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో విస్తరిస్తాయి.

Read also: Kalki 2898 AD : ప్రభాస్ ‘కల్కి’ నుంచి సాంగ్ వచ్చేస్తుంది.. స్పెషల్ అప్డేట్ వైరల్..

ఇవాళ (మే 19) నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని.. మరో నాలుగు రోజుల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత రెండు రోజుల్లో బలపడి మే 24 నాటికి తుపానుగా మారే అవకాశం ఉందని.. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కోస్తా ఆంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమ, కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సోమవారం (మే 20)న 30, 40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

Read also: SRH vs PBKS: లీగ్ దశలో విజయంతో ముగించాలనుకుంటున్న సన్ రైజర్స్.. వరుణదేవుడు కరుణిస్తాడా..

హైదరాబాద్‌లో శనివారం భారీ వర్షం కురిసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో దాదాపు 2 గంటల పాటు వర్షం కురిసింది. సెరిలింగంపల్లి, మియాపూర్, చందానగర్, మేడ్చల్, దుండిగల్, ప్రగతినగర్, నిజాంపేట్, కండ్లకోయ, గండిమైసమ్మ, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, నాగోల్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పటాన్‌చెరు, ఆర్‌సీ పురం, అమీన్‌పూర్‌ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. బేగంపేట, ప్యారడైజ్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, అల్వాల్‌, జవహర్‌నగర్‌, చిలకలగూడలోనూ భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు విజయవాడ రహదారి రోడ్లు చెరువులా మారాయి. కొన్ని చోట్ల వర్షం నీరు నిలవడంతో ట్రాఫిక్‌ జామ్‌లు ఏర్పడ్డాయి. ఆది, సోమవారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించారు.
GunFire : ఓహియో రాజధాని కొలంబస్‌లో కాల్పులు.. ముగ్గురి మృతి..ముగ్గురికి గాయాలు