NTV Telugu Site icon

Chaddi Gang: అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు.. మహిళపై దాడి.. చెడ్డీ గ్యాంగ్ పనేనా..?

Chaddi Gang

Chaddi Gang

విశాఖలో అర్థరాత్రి రెచ్చిపోయారు దొంగలు.. పెందుర్తి చీమలాపల్లిలో అర్ధరాత్రి సమయంలో ఓ ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. అందినకాడికి దోచుకున్నారు.. కిటికీ తొలగించి ఇంట్లోకి చొరబడ్డారు ఇద్దరు దొంగలు.. ఈ సమయంలో ఇంట్లో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇంట్లో నిద్రిస్తున్న సుమారు 25 సంవత్సరాల మహిళను వారు తెచ్చుకున్న స్క్రూడ్రైవర్‌తో పొడిచి తీవ్రగాయాలు చేశారు.. ఇక, అత్త మామ నిద్రిస్తున్న రూమ్‌కు బయటనుంచి గడియ పెట్టి పరారయ్యారు దొంగలు.. అయితే, దొంగల ప్రయత్నాన్ని సదరు మహిళ అడ్డుకునే ప్రయత్నం చేయడంతోనే ఆమెపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, గాయాలైన మహిళను నగరంలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు.. ప్రస్తుతం ఆ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. అయితే, ఇది చెడ్డీ గ్యాంగ్‌ పనేనా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్‌, క్రైం పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.. పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన జరగడంతో.. వారే దర్యాప్తు చేపట్టారు.

Read Also: PM Narendra Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ..

Show comments