Polavaram Back Water: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న పోలరవం ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలవరం నీటిపారుదల ప్రాజెక్టుపై జనవరి 25న ఢిల్లీలో సమావేశం జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ సమావేశం ఇరు రాష్టాలు తీసుకున్న నిర్ణయంపై చర్య తీసుకోవాలని స్పష్టం చేసింది.. పోలవరం బ్యాక్ వాటర్ పై ఉమ్మడి సర్వే పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది.. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమన్వయం చేసుకోవాలని సూచించింది కేంద్ర జలశక్తి శాఖ.
Read Also: Gannavaram Incident: గన్నవరం ఘటన.. రెచ్చగొట్టింది ఎవరు?
కాగా, పోలవరం ప్రాజెక్టును మార్చి 2024 కల్లా పూర్తి చేయాలన్నది లక్ష్యంగా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు ప్రకటించిన విషయం విదితమే.. దీని కోసం జూన్ 2024 కల్లా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ పూర్తి చేయాలన ఆదేశాలు జారీ చేశారు.. అయితే, గోదావరి నదికి ఇటీవల వచ్చిన వరదల కారణంగా కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందన్నారు.. గతంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని.. ప్రస్తుతం ఉన్న గడువులోగా పోలవడం పూర్తికవాడం కష్టమేనని కేంద్రం ప్రకటించిన విషయం విదితమే.. పోలవరం ప్రాజెక్ట్‌ను 2024 మార్చి నాటికి, ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను 2024 జూన్ నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేయబడిందని.. కానీ, గోదావరిలో పెద్ద వరదల కారణంగా ప్రతిపాదిత షెడ్యూల్‌లో కొంత జాప్యం జరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.