NTV Telugu Site icon

Polavaram Project: ప్రాజెక్ట్ ని పరిశీలించిన కేంద్ర బృందం

Polavaram 1

Polavaram 1

ఆంధ్రా ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టులో పనులు వేగంగా సాగుతున్నాయి. న్యూఢిల్లీ నుండి వచ్చిన కేంద్ర నిపుణుల బృందం శనివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించింది. కేంద్ర జలశక్తి సంఘం సభ్యులు కె.వోహ్రా, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఎం.కె. సిన్హా, కృష్ణా గోదావరి రివర్ బోర్డు అధికారి డి. రంగారెడ్డి, సి.డబ్ల్యు.సి. సి.ఇ. ఆర్కే పచోరి, పి.పి.ఎ. మెంబర్ సెక్రటరీ ఎం.కె. శ్రీనివాస్, సీ.డబ్ల్యూ.సీ. డైరెక్టర్ సంజయ్ కుమార్, డిజైనింగ్ సి.ఇ. మొహమ్మద్ ఖయ్యుం , పి.పి.ఎ. సి.ఇ. ఏ.కే. ప్రధాన్, డైరెక్టర్ పి.దేవేందర్ రావు, ఈ సైంటిస్ట్ మనీష్ గుప్తా, సి.డ.బ్ల్యూ.సి. డిప్యూటీ డైరెక్టర్ నిఖిల్ జఫ్, సీ.పీ.ఐ. డిప్యూటీ డైరెక్టర్ ఎ. ప్రవీణ్ ల బృందం ఈ పరిశీలనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ బృందానికి పోలవరం ప్రాజెక్టు ఇంజనీరింగ్ చీఫ్ సి.నారాయణ రెడ్డి, సి.ఇ. సుధాకర్ బాబు, ఎస్.ఇ. నరసింహమూర్తి సంబంధిత వివరాలను మ్యాప్ పాయింటింగ్ ద్వారా వివరించారు.తొలుత పోలవరం ప్రాజెక్టు గేట్లను పరిశీలించింది బృందం. అనంతరం స్పిల్వే గేట్లను కదిలించేందుకు ఉపయోగించే పవర్ ప్యాక్, సిలిండర్ల అమరిక, స్పిల్వేలో ఎడమ వైపు 560 మీటర్ల పొడవునా నిర్మిస్తున్న ఎడమ గైడ్ వాల్ బండ్ పనులు, గ్యాప్ 3 నిర్మాణంలో 53.320 మీటర్ల పొడవునా నిర్మించిన కాంక్రీట్ వాల్ ని పరిశీలించారు.

అనంతరం ఎగువ కాఫర్ డ్యాం ని, పవర్ హౌస్ ప్రెజర్ టన్నెల్స్ తవ్వకం పనులను, డయాఫ్రంవాల్ ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం ఎడమ ప్రధాన కాలువ కనెక్టివిటీ పనులను బృందం పరిశీలించింది. వారి వెంట ఇ.ఇ. లు బాలకృష్ణ, ఆదిరెడ్డి, మల్లికార్జున రావు, ప్రాజెక్టు సి.ఐ. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..