Site icon NTV Telugu

Central Minister Narayana Swamy: అసెంబ్లీ ఎక్కడుంటే అదే రాజధాని

A N Swamy 1

A N Swamy 1

కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ఆయన చేసిన కామెంట్లు చర్చనీయాంశంగా మారాయి. విజయవాడలో కేంద్ర మంత్రి నారాయణస్వామి పర్యటించారు. రాష్ట్రంలో 72 గ్రామాల్లో కిడ్నీ బాధితులు ఉన్నారు. జల్ జీవన్ పధకం ద్వారా ఎందుకు త్రాగునీరు ఇవ్వడం లేదో పరిశీలించాం. అటల్ భూజల్ యోజన ద్వారా 72 గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలని అధికారులను ఆదేశించాం అన్నారు.

అసెంబ్లీ ఎక్కడ ఉందో అదే రాజధాని…కేంద్రం నుంచీ చాలా పనులు అనుమతులు పొంది 40శాతంపైగా పూర్తయ్యాక కాదనడానికి లేదు..పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల మధ్య అమరావతి అభివృద్ధి చెందుతుంది..కేంద్రం రాజధాని ఇదే అని నిర్ణయాన్నిఫెడరల్ సిస్టంలో చెప్పదు. రాష్ట్ర విభజన హామీలు మాత్రమే కేంద్రం బాధ్యత అన్నారు నారాయణస్వామి. అభివృద్ధి కొనసాగించాలన్నారు.

Read Also: Kishan Reddy : ఏడాది పాటు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

ఆయుష్మాన్ భారత్ కార్డులు ఏపీలో ఒక్కటి కూడా లేవు. ఏపీ ప్రభుత్వం హెల్త్ కార్డులకు కేంద్ర నిధులు ఎలా వినియోగిస్తున్నారో తెలియడం లేదు. త్వరలో స్టేట్ రివ్యూ మీటింగ్ కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతాను. టిడ్కోకి కేంద్రం వాటా కూడా ఉంటుంది… లక్ష మంది కంటే ఎక్కువ లబ్ధిదారులు ఉన్నా 6వేల 258 ఇళ్ళే కట్టారు. 6వేల 258లో 1500 మాత్రమే పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి..మంగళగిరి ఎయిమ్స్ కు నీటి వసతి ఇవ్వలేని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు?

ఎయిమ్స్ కు ఇన్ పేషెంట్లు లేరు…నేషనల్ హైవే వస్తుందని తెలిసి కూడా రాష్ట్రం పట్టాలు ఎలా ఇస్తుంది.ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ ఇవ్వాలని అధికారులను ఆదేశించాం అన్నారు.. జల్ జీవన్ ప్రోగ్రామ్ కి సరైన డీపీఆర్ లేదు. జల్ జీవన్ మిషన్ స్కీమ్ సరిగా అమలు కావడం లేదన్నారు కేంద్రమంత్రి.

Read Also: Minister KTR : స్టూడెంట్స్ జాబ్ సీకర్ గా కాకుండా జాబ్ క్రియేటర్ గా తయారవ్వాలి

Exit mobile version