Central Minister Muraleedharan Says AP People Looking For Alternative Political Power: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం చూస్తున్నారని కేంద్రమంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మురళీధరన్ పేర్కొన్నారు. ఆదివారం మంగళగిరిలో కొనసాగించిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పార్టీ బలోపేతం కోసం రానున్న కాలంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ముఖ్య భూమిక పోషించి.. బీజేపీని ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలపాలని పిలుపునిచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పార్టీ ముఖ్య నేతల సమావేశంలో కూడా.. ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్ణయించామని తెలిపారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవినీతి అక్రమాలతో.. ప్రజా విశ్వాసం కోల్పోయిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ వైఫల్యం చెందిందని పేర్కొన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా నిలిపేందుకు.. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కి ఒక రోడ్డు మ్యాప్ డిసైడ్ చేసుకోవాలని సూచించారు.
Weight Loss: బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. తగ్గడానికి ఇలా చేయండి..!
ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి సైతం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. నాపై గురతర బాధ్యతలున్నాయని.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదని.. ప్రతీ కార్యకర్త తనకు సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పార్టీని ప్రజలకు చేరువ చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కసరత్తు చేయాలని అధినాయకత్వం సూచించిందన్నారు. ఎన్నికలకు ఐదారు నెలల సమయమే ఉంది కాబట్టి.. అన్ని స్థాయిల్లోని కమిటీలను బలోపేతం చేసుకోవాల్సి ఉంటుంద్నారు. అలాగే.. రాజకీయంగా వేసే అడుగులపై కూడా ఆలోచించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ఎటు చూసినా సమస్యల వలయమేనని, కేంద్రం అనేక రకాలుగా సహకారం అందిస్తున్నా నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందన్నారు. బీజేపీ ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీ అని పురందేశ్వరి ఉద్ఘాటించారు.
Venugopala Krishna: అక్కడ వైసీపీలో అసమ్మతి లేదు.. మంత్రి వేణుగోపాల్ క్లారిటీ