Site icon NTV Telugu

త్వరలో అందుబాటులోకి డెంగ్యూ, టీబీకి వ్యాక్సిన్లు

దేశవ్యాప్తంగా మహమ్మారి టీబీ అదుపులో వున్నా.. డెంగ్యూ మాత్రం తన ప్రతాపం చూపుతూనే వుంది. కేంద్రం టీబీ, డెంగ్యూలకు వ్యాక్సిన్ల ను తెచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని రాజ్యసభలో విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబిచ్చారు. అమెరికాలో 9 నుంచి 16 ఏళ్ళ మధ్య పిల్లల కోసం డెంగ్యూ వాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది.

భారత్‌లో కూడా డెంగ్యూ నివారణకు ఈ తరహా వాక్సిన్‌ తీసుకువచ్చే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా అని ఈరోజు రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రశ్నించారు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. దీనిపై జవాబిచ్చారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ.ప్రభుత్వం టీబీ, డెంగ్యూ జబ్బులకు వాక్సిన్లను అభివృద్ధి చేస్తోంది. వాక్సిన్‌ నిపుణుల ఆమోదం, సిఫార్సుల అనంతరం ఈ రెండు వాక్సిన్లను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తెస్తుందని కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.

Exit mobile version