Central Govt Ban State Power Purchases Telangana: విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించలేదన్న కారణంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 13 రాష్ట్రాల డిస్కంల రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం
గురువారం అర్ధరాత్రి నుంచి నిషేధం విధించింది. ఇకపై డిస్కంలు ఇంధన ఎక్స్చేంజి ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు కరెంట్ అమ్మకాలకు అవకాశం ఉండదు. దీనివల్ల తలెత్తే లోటు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం ఉంది. దీంతో అధికారులు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నారు.
డిస్కంలపై నిషేధం ఎందుకంటే?
కేంద్ర ఇంధన శాఖ జూన్ నుంచి లేట్ పేమెంట్ సర్ఛార్జి నిబంధనను అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం విద్యుదుత్పత్తి సంస్థలకు డిస్కంలు 45 రోజుల్లో బిల్లులు చెల్లించాలి. అయితే నెల వ్యవధిలో 13 రాష్ట్రాల్లోని డిస్కంల బకాయిలు రూ.5,085 కోట్లకు చేరాయి. అత్యధికంగా తెలంగాణలో రూ.1,380 కోట్లు, అత్యల్పంగా బిహార్ లో రూ.172 కోట్లు చెల్లించలేదు. దీంతో డిస్కంల విద్యుత్, కొనుగోలు, అమ్మకాలపై కేంద్రం నిషేధం విధించింది.
అవసరానికి కొనుగోళ్ల కోసం..
ఇక విద్యుత్ లభ్యతకు మించి డిమాండ్ ఉన్న రాష్ట్రాలు ఆ లోటును పూడ్చుకోవడానికి ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తుంటాయి. అంతేకాకుండా.. విద్యుత్ డిమాండ్ తగ్గి, మిగిలిపోయినప్పుడు దానిని ఎనర్జీ ఎక్స్చేంజీలో విక్రయిస్తుంటాయి. దీంతో కేంద్రం తాజాగా నిషేధం విధించడంతో ఆయా రాష్ట్రాలు విద్యుత్ కొనుగోలు, అమ్మకాల అవకాశాన్ని కోల్పోనున్నాయి. ఇక.. తెలంగాణ బుధవారం ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి ఏకంగా 1980 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.
ప్రస్తుతానికి ప్రభావం తక్కువే!
రాష్ట్రంలో విస్తారంగా వానలు పడుతుండటంతో ప్రస్తుతం వ్యవసాయ విద్యుత్ డిమాండ్ తక్కువగా ఉంది. ఈ సమయంలో కృష్ణా, గోదావరి నదులకు భారీగా వరద వస్తుండటంతో శ్రీశైలం, సాగర్, జూరాల, పులిచింతల ప్రాజెక్టుల్లో గణనీయంగా విద్యుదుత్పత్తి జరుగుతోంది. దీనివల్ల.. ఎనర్జీ ఎక్స్చేంజీ నుంచి విద్యుత్ కొనుగోళ్లపై నిషేధం ప్రభావం పెద్దగా కనబడే అవకాశం లేవు.
గత వేసవిలోనూ నిషేధం
ఈనేపథ్యంలో.. ఆదానీ పవర్ కంపెనీ నుంచి కొన్న సౌర విద్యుత్ బిల్లులను గడువులోగా చెల్లించలేదంటూ కేంద్రం గత వేసవిలోనూ రాష్ట్రంపై నిషేధం విధించింది. దీంతో..ఆ నిషేధంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో రాష్ట్రానికి ఊరట లభించింది.
Janmashtami 2022: ఘనంగా శ్రీకృష్ణ ‘జన్మాష్టమి’ వేడుకలు.. రాష్ట్రపతి శుభాకాంక్షలు