తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్‌లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది.
ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయి. ఏపీలోని కడప జిల్లాకు చెందిన పూజ ఇంటర్నేషనల్ స్కూల్ సైనిక్ స్కూల్‌గా మారనుంది. ఇక తెలంగాణలో కరీంనగర్‌కు చెందిన సోషల్ వెల్ఫేర్ స్కూల్‌ను సైనిక్ స్కూల్‌గా సేవలు అందించనుంది. కాగా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అదనంగా సైనిక్ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
