NTV Telugu Site icon

Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్‌.. రెవెన్యూ లోటు నిధులు రిలీజ్‌

Jagan

Jagan

ఏపీ జ‌న‌గ్ స‌ర్కార్ కు కేంద్రం శుభవార్త చెప్పింది. ఇవాళ‌ రెవెన్యూ లోటు కింద కేంద్రం రూ.879.08 కోట్లు విడుదల చేసింది. అయితే.. నిధుల పంపిణీ తర్వాత లోటు ఏర్పడిన రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ నిధులు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఈనేప‌థ్యంలో.. ఆర్థిక సంవత్సరం 2022, 2023లో రాష్ట్రానికి రెవెన్యూ లోటు కింద రూ.10,549 కోట్లు ఇవ్వాలని సిఫారసు చేయగా, ఇప్పటి వరకు కేంద్రం రూ.3,516.33 కోట్లు విడుదల చేసింది. కాగా.. ప్రస్తుతం జూలై నెలకు సంబంధించి ఆంధ్ర సహా 14 రాష్ట్రాలకు కలిపి రూ.7,183.42 కోట్లు ఇచ్చినట్లు ఆర్థిక శాఖ ప్రకటించింది.

ఆంధ్రపదేశ్ ప్ర‌భుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఈ నిధులు బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటూ అసోం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌కు రెవెన్యూ లోటు విడుదల చేసింది కేంద్రం. అయితే.. ఈ 14 రాష్ట్రాలకు పోస్ట్ రివేల్యుయేషన్ రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్‌ను విడుదల చేయాలంటూ 15వ ఆర్థిక కమిషన్ సిఫారసు చేసింది. దీంతో.. అనుగుణంగా కేంద్ర ఆర్థికశాఖ ఈ రెవెన్యూ లోటు నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Car Accident : యువతిని ఢీకొట్టిన కారు.. కానీ..

Show comments