Train Birthday: రైలుకీ ఒక రోజు వచ్చింది. పుట్టిన రోజు. హ్యాపీ బర్త్ డే పినాకిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజంగా ఇది వెరైటీ న్యూసే. ఆసక్తి కలిగించే వార్త కూడా. మనుషులకు ఘనంగా, సంతోషంగా ఏటా పుట్టిన రోజులు చేసుకోవటం సహజం. ఈమధ్య జంతువులకు కూడా అడపా దడపా నిర్వహిస్తున్నారు. జీవంతో ఉన్నవాటికి జన్మదినోత్సవాన్ని జరిపితే పెద్దగా చెప్పుకోవాల్సి పనిలేదు గానీ ఇవాళ ఒక ప్రాణంలేని భారీ యంత్రానికి (రైలుకి) సైతం బర్త్ డే సెలబ్రేషన్ జరగటం విశేషం. ఈ అరుదైన వేడుకలకి విజయవాడ రైల్వే జంక్షన్ వేదిక కావటం గమనార్హం. పినాకిని ఎక్స్‌ప్రెస్ సర్వీసుకి 30 ఏళ్లు నిండిన సందర్భంగా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. విజయవాడ-చెన్నై మధ్య నిత్యం రాకపోకలు సాగించే ఈ సూపర్ ఫాస్ట్ రైలు నేటితో మూడు దశాబ్దాల ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది.
Viral News: అతనికి 61.. ఆమెకి 18.. ఆయనే బెస్ట్ అంటూ కితాబు
Also Read
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- NRI: అంతిమ శ్వాస భారత్‌లోనే... అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
- AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
దీంతో అధికారులు, ఉద్యోగులు, అభిమానులు ఈ వండర్‌ఫుల్ ఈవెంట్ నిర్వహించారు. రైలింజన్‌ని పూల దండలతో అలంకరించి, కేట్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకొని ఎంజాయ్ చేశారు. పినాకిని వద్దకు చేరి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రోగ్రామ్ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. పినాకిని సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 1992 జూలై 1న పరుగు ప్రారంభించింది. రోజూ 431 కిలోమీటర్లు వెళ్లి, తిరిగొస్తుంది. ఒక వైపు ప్రయాణానికి 7 గంటల సమయం పడుతుంది. ఈ ట్రైన్ మెయింటనెన్స్‌ను విజయవాడ డివిజనే చూసుకుంటోంది. ఘనత వహించిన భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి ఒక వేడుక జరగటం గతంలో ఎప్పుడూ చూడలేదు.. వినలేదు అని ప్రయాణికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?
Celebrating 30 Years of #PinakiniExpress
Pinakini Express is a daily Superfast Express connecting #Vijayawada Junction of @SCRailwayIndia to MGR #Chennai Central @RailfansScr Kudos to your team and thank you for arranging the wonderful event to mark the occasion@GMSRailway pic.twitter.com/FpsQiXLsNy
— 𝗩𝗶𝗷𝗮𝘆𝗮𝘄𝗮𝗱𝗮 𝗗𝗶𝘃𝗶𝘀𝗶𝗼𝗻 𝗦𝗖𝗥 (@VijayawadaSCR) July 1, 2022
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్‌గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్‌ఫోన్‌ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్‌షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?