NTV Telugu Site icon

CBI Summons YS Bhaskar Reddy: వైఎస్‌ వివేకా హత్య కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి సీబీఐ నోటీసులు

Cbi

Cbi

CBI Summons YS Bhaskar Reddy: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణకు వైఎస్‌ వివేకా హత్య కేసు బదిలీ అయిన తర్వాత.. దూకుడు పెంచిన సీబీఐ.. వరుసగా నిందితులను నోటీసులు జారీ చేస్తూ.. విచారణ జరుపుతోంది.. ఇక, ఈ కేసులో తాజాగా వైఎస్‌ భాస్కర్ రెడ్డికి నోటీసులు పంపింది సీబీఐ.. రేపు అనగా.. శనివారం కడప సెంట్రల్ జైలు గెస్ట్ హౌస్ లో జరిగే విచారణకు హాజరు కావాలని.. తన నోటీసుల్లో సీబీఐ పేర్కొంది.. రేపు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని సూచించింది సీబీఐ.. అయితే, గతంలోనే వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరుకావాలని సూచించింది.. కానీ, ఈ నెల 23న జరగాల్సిన సీబీఐ విచారణకు హాజరుకాలేనని గతంలో సీబీఐకి లేఖ రాశారు భాస్కర్‌ రెడ్డి.. దీంతో.. మరోసారి నోటీసులు జారీ చేసిన సీబీఐ.. 25వ తేదీన కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లో ఉదయం 10 గంటలకు విచారణఖు హాజరు కావాలని పేర్కొంది.

Read Also: Shriya Saran: అందమా.. అలా.. వలేసి.. చంపకే.. ఇలా

కాగా, వైఎస్‌ వివేకా హత్య కేసులో ఈ రోజు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది సీబీఐ.. ఆయన్ను సీబీఐ ప్రశ్నించడం ఇది రెండోసారి.. సీబీఐ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడిన అవినాష్‌రెడ్డి.. వాస్తవాలు టార్గెట్‌గా కాకుండా.. వ్యక్తి టార్గెట్ గా విచారణ సాగుతోందని ఆరోపించారు.. సీబీఐ దర్యాప్తు పారదర్శకంగా సాగాలని డిమాండ్‌ చేశారు.. ఈ కేసులోని వాస్తవాలపై నేను సీబీఐ అధికారులకు ఒక రిప్రజంటేషన్‌ ఇచ్చాను అని వెల్లడించారు.. నాకున్న అనుమానాలు ప్రస్తావించాను.. గూగుల్‌ టేక్‌ఔట్‌ అంటూ గతంలో టీడీపీ ప్రస్తావించింది.. మరి ఇప్పుడు ఆ ప్రశ్నలు వస్తున్నాయంటే.. ఇది గూగుల్‌ టేక్‌ఔటో..? టీడీపీ టేక్‌ఔటో బయటపడుతుందన్నారు.. టీడీపీ చెప్పిన అంశాలను సీబీఐ కౌంటర్ లో ప్రస్తావిస్తుందని విమర్శించారు ఎంపీ అవినాష్‌రెడ్డి.. పారదర్శకంగా విచారణ సాగాలని కోరుతున్నాను.. వైఎస్‌ వివేకా ఇంట్లో దొరికిన లెటర్ బయటపెట్టాలని కోరారు.. వివేకా చనిపోయిన రోజు మాట్లాడిన మాటలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.. విచారణ సమయంలో ఆడియో, వీడియో రికార్డు చెయ్యాలని కోరాను.. కానీ, అది జరుగలేదన్నారు.. ఇక, నాకు 160 సీఆర్‌పీసీ నోటీస్ ఇచ్చి విచారిస్తున్నారని తెలిపిన అవినాష్‌రెడ్డి.. కానీ, నన్ను సాక్షిగా విచారిస్తున్నారో, నేరస్తుడిగా విచారిస్తున్నారో అర్థం కావట్లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి.