మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో స్పీడ్ పెంచింది సీబీఐ.. ఇప్పటికే వాచ్‌మెన్ రంగయ్య వాంగ్మూలం ఇవ్వడంతో.. అది ఈ కేసులు చాలా కీలకంగా మారింది.. అయితే, ఇవాళ ఈ కేసులో మాజీ డ్రైవర్ దస్తగిరి, ఆయన భార్యను పులివెందుల ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో విచారిస్తున్నారు సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలు మార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు దస్తగిరి… ఇవాళ పులివెందుల కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉందని తెలుస్తోంది.. మధ్యాహ్నం నుంచి పులివెందుల కోర్టులో బిజీ బిజీగా ఉన్నారు ఇద్దరు సీబీఐ అధికారులు… సిఆర్‌పీ 164 కింద జడ్జి సమక్షంలో వాంగ్మూలం రికార్డ్ చేయనున్నట్లు సమాచారం.. గత రెండు రోజుల క్రితం వాచ్‌మన్ రంగయ్య.. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు పేర్లును ప్రముఖంగా తెలిపారు.. అందులో దస్తగిరి సైతం ఉన్నాడు.. దీంతో.. ఇవాళ ఆయనపై ఫోకస్ పెట్టింది సీబీఐ.. ఇక, గత రెండు రోజుల క్రితం జమ్మలమడుగు కోర్టులో వాచ్‌మెన్ రంగయ్య వద్ద రికార్డు చేసిన సీఆర్‌పీ 164 వాంగ్మూలం కావాలని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేసినట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా కేసు.. స్పీడ్ పెంచిన సీబీఐ.. కీలకంగా రంగయ్య వాంగ్మూలం

YS Vivekananda Reddy