NTV Telugu Site icon

CBI Raids: జేసీ ట్రావెల్స్‌ ఫోర్జరీ కేసు.. రంగంలోకి సీబీఐ

Cbi

Cbi

అనంతపురం జిల్లా తాడిపత్రిలో సీబీఐ సోదాలు మరోసారి హాట్‌ టాపిగ్గా మారాయి. జేసీ ఫ్యామిలీ.. బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4గా అక్రమంగా విక్రయించిందన్న ఆరోపణలపై ఢిల్లీ నుంచి వచ్చిన సీబీఐ బృందం.. పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్య అనుచరుడు చవ్వా గోపాల్‌రెడ్డికి చెందిన జఠధార ఇండస్ట్రీస్‌ కార్యాలయంతో పాటు, ఆయన ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. కీలకమ్తెన డాక్యుమెంట్ల కోసం వెతికినట్లు సమాచారం. నిన్న రాత్రి వరకు సోదాలు కొనసాగాయి.

Read Also: India vs Bangladesh: టాస్‌గెలిచిన బంగ్లా.. టీమిండియా తుది జట్టు ఇదే..

ఇదే కేసులో ఈడీ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే జేసీ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. జేసీ ప్రభాకర్‌రెడ్డి సంస్థకు చెందిన 22 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. జఠధార ఇండస్ట్రీస్‌, గోపాల్‌ రెడ్డి అండ్‌ కో కంపెనీలు… అశోక్‌లేలాండ్‌ నుంచి తక్కువ ధరకే బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేసి… నాగాలాండ్‌, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారనేది జేసీపై ప్రధాన అభియోగం. దాదాపు 38 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది.