నిత్యం రద్దీగా వుండే విజయవాడలో ఓకారులో లభించిన డెడ్ బాడీ అందరినీ పరుగులు పెట్టించింది. చాలా రోజుల నుంచి అక్కడో కారు పార్క్ చేసి ఉన్నా నిత్యం అక్కడ గస్తీ తిరిగే పోలీసులు పట్టించుకోలేదు. ఆ ప్రాంతంలో కారులో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు ఆ కారును పరిశీలించారు. కారులో డెడ్ బాడీ వుండడంతో అసలేం జరిగిందో అర్థంకాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కృష్ణాజిల్లా పటమటలంకలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. పటమటలంకలోని డి మార్ట్ సమీపంలో విఎంసీ స్కూల్ వద్ద పార్కింగ్ చేసిన కారులో డెడ్ బాడీ మిస్టరీగానే వుంది. AP37 BA 5456 నెంబర్ ఉన్న ఇండిగా కారులో మృతదేహం కనిపించింది.
కారులో వున్న డెడ్ బాడీ వెనుక కథేంటో తేల్చేపనిలో పడ్డారు పోలీసులు. సీసీ కెమేరాల ఆధారంగా కేసును ఛేదించే పనిలో ఉన్నారు విజయవాడ పోలీసులు. అయితే, ఈ డెత్ మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఈ డెడ్ బాడీ విజయవాడకు చెందిన బాషాగా గుర్తించారు. బాషాది సహజ మరణమా లేక ఆత్మహత్య చేసుకున్నారా అనే ఇతర కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు పోలీసులు. బాషా రెండో భార్య పై అనుమానాలు వ్యక్తం చేస్తోంది మొదటి భార్య. మార్చురీలోనే అతని మృతదేహం వుంది. దీనికి పంచనామా చేస్తే కానీ మరణానికి గల కారణాలు ఏంటో తెలియవంటున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. కొద్ది రోజుల నుంచి కారు రోడ్డుపక్కనే నిలిపి ఉంటే ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. కనీసం రాత్రులు పెట్రోలింగ్ చేసే సిబ్బందికి అయినా అనుమానం వచ్చి ఉండాలంటున్నారు. ఏది ఏమైనా విజయవాడలో ఈ కారు డెడ్ బాడీ వెనుక మిస్టరీ ఏంటో తేలాల్చి వుంది.
Mp Sanjeev Kumar: ఎంపీని బురిడీ కొట్టించిన కేటుగాడు