NTV Telugu Site icon

Brother Anil Kumar: ఉండవల్లితో సుదీర్ఘ భేటీ.. రహస్య విషయాలపై చర్చ!

అంతర్జాతీయ సువార్తకులు బ్రదర్ అనిల్ కుమార్‌ ఉన్నట్టుండి సీనియర్‌ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ను కలిశారు.. సుదీర్ఘంగా సమాలోచనలు జరిపారు.. అయితే, ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడినా.. ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలను త్వరలో బయటపెడతాననడం ఆసక్తికరంగా మారింది.. కానీ, ఉండవల్లి అరుణ్ కుమార్‌ను మర్యాద పూర్వకంగానే కలిశానని.. సుమారు గంట సేపు చర్చలు జరిగాయని తెలిపిన ఆయన. తెలంగాణ, ఏపీకి సంబంధించిన రాజకీయ అంశాలు చర్చకు వచ్చాయన్నారు.. పార్టీపరంగా, కుటుంబ పరంగా ఉండవల్లి సలహాలు ఇచ్చారని… రాజకీయ జ్ఞానం నేర్చుకోవడం కోసమే తాను ఉండవల్లి దగ్గరకు వచ్చానని.. ఉండవల్లి జ్ఞానం నచ్చిందని పేర్కొన్నారు.

Read Also: Russia Ukraine War: ఒంటరై పోయామంటూ అధ్యక్షుడి ఆవేదన

ఇక, ప్రజలకు మంచి చేయడమే నిజమైన రాజకీయం అని అభిప్రాయడ్డారు బ్రదర్‌ అనిల్.. నేను ప్రభువును నమ్ముకున్నాను, దేవుడు చెబితే కానీ ఏది చేయనన్న ఆయన.. తమ కుటుంబం ఎప్పుడో రాజకీయాల్లో ఉందన్నారు.. రాజకీయం అనేది పెద్ద వ్యవస్థ అని కామెంట్‌ చేశారు.. అయితే, ఉండవల్లితో భేటీకి సంబంధించిన విషయాలు త్వరలో బయటపెడతామని.. కుటుంబానికి, రాజకీయాలకు సంబంధించిన రహస్య విషయాలు చర్చకు వచ్చాయంటూ కామెంట్‌ చేసి ఆసక్తిపెంచేశారు బ్రదర్ అనిల్‌.. తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన బ్రదర్‌ అనిల్ భార్య వైఎస్‌ షర్మిల.. సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న విషయం తెలిసిందే.. ఇక, ఈ భేటీ సందర్భంగా విభజన కథ బుక్‌ను బ్రదర్ అనిల్ కుమార్‌కు ఉండవల్లి అరుణ్ కుమార్ ఇచ్చారని తెలిపారు..