విశాఖపట్నంలోని మధురవాడలో పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో మెడలో తాళి పడుతుందని అందరూ అనుకుంటున్న సమయంలో పెళ్లి పీటలపైనే ఓ వధువు ప్రాణాలు కోల్పోయింది. నగరం పాలెంలో బుధవారం రాత్రి 7 గంటలకు నాగోతి శివాజీ, సృజనల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. పండితులు వేద మంత్రాల మధ్య జీలకర్ర బెల్లం పెట్టే ప్రక్రియ మొదలైంది. ఇంతలోనే ఊహించని విధంగా సృజన పెళ్లి పీటలపై కుప్పకూలింది.
Vangalapudi Anitha: అత్యాచారాలకు కామానేనా? ఫుల్‌స్టాప్ పడేది ఎప్పుడు?
సృజన ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోవడంతో కంగారుపడ్డ కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే వధువు సృజన ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు నిర్ధారించారు. దీంతో పెళ్లింట విషాదం నెలకొంది. గత రెండు రోజులుగా పెళ్లి పనుల కారణంగా వధువు సృజన అలసటకు గురై నీరసించిందని భావించామని బంధువులు వివరిస్తున్నారు. కానీ ఆమె ఇలా ప్రాణాలు కోల్పోతుందని అనుకోలేదని కన్నీటి పర్యంతం అవుతున్నారు.
