బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపికపై మళ్లీ వివాదం రాజుకుంటుంది. మఠాధిపతి ఎంపికపై హైకోర్టులో రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ రిట్ పిటిషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. తనపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా ఒప్పుకునే లాగా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. మఠాధిపతిగా ఎంపికైన వెంకటాద్రి స్వామి నియామకాన్ని నిలుపుదల చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు అని సమాచారం. వీలునామా ప్రకారం కాకుండా స్థానిక ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ అధికారులు మఠాధిపతిని ప్రకటించారని మారుతి మహాలక్ష్మమ్మ పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది.