Botsa vs Somu Veerraju Over Shivratri Poster: శివరాత్రి సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ తన అధికార ట్విటర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందంటూ.. బీజేపీ వాళ్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిని వెంటనే తొలగించాల్సిందిగా వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ పోస్టర్‌పై సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు. ప్రతిపక్ష పార్టీల మనుగడ పూర్తిగా కనుమరుగు చేయడమే రాష్ట్రంలో రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థల లక్ష్యంగా కనిపిస్తుందని ఆరోపించారు. ‘‘పేద వాళ్ళు అని పేర్కొంటూనే, చేతిలో డమరుకాన్ని చిత్రీకరించిన చర్య హైందవ ధర్మం & హిందువుల మనోభావాల పట్ల వైసీపీ ప్రభుత్వం యొక్క చులకన భావానికి ప్రతీక. ఇలాంటి ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ, హైందవ సమాజానికి తక్షణమే క్షమాపణలు చెప్పాలని వైఎస్ఆర్‌సీపీ పార్టీని డిమాండ్ చేస్తున్నాను’’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు.. ‘‘రాష్ట్రంలో ఉన్న గిరిజన సంకేమ హాస్టళ్ళు, BC, SC సంక్షేమ హాస్టళ్లలో ఉండే పిల్లలకు సరిగా తిండిపెట్టలేరు గానీ మన సీఎం వైఎస్ జగన్ శివుడికి పాలుపోసి శివతత్వా న్ని బోదించేస్తారు’’ అని పేర్కొన్నారు. ‘‘అధికారమే పరమావధిగా భావిస్తూ.. హిందువులను కేవలం ఓటు బ్యాంకుగానే భావిస్తారు. హైందవ ధర్మ విఘాతానికి పాల్పడే అసాంఘిక శక్తులను నిలువరించకపోగా, నేరుగా పార్టీ అధికారిక ఖాతా నుండే పరమేశ్వరుని కించపరిచే ప్రచారాలు చేయిస్తున్నారు. మీ భావజాలాన్ని ప్రజలు గమనిస్తున్నారు’’ అంటూ మరో ట్వీట్‌లో ఫైర్ అయ్యారు.
Harish Rao: అభివృద్ధి చూడండి.. తప్పుడు ప్రచారాలు చేయకండి
ఇందుకు మంత్రి బొత్స నారాయణ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శివరాత్రి పోస్టింగ్ మీద బీజేపీది అనవసర రాద్దాంతం చేస్తోందని వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో బీజేపీ చెప్పాలన్నారు. బీజేపీ దిగజారుడు, వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించారు. డబుల్ తత్వాలు, తప్పుడు విధానాలు తమవి కావన్నారు. గుడులను కూల్చి ధర్నా చేసే సంస్కారం వాళ్లదని పేర్కొన్నారు. ఎంపీ జీవీఎల్ అందరికంటే మేధావా? MLC ఎన్నికల్లో 200 శాతం విజయం తమదేనన్నారు. దీనిని రెఫరెండంగా తీసుకుని హడావిడి చేయాల్సినంత అవసరం లేదని హితవు పలికారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉల్లంఘనలకు పాల్పడ్డామనేది అర్ధంలేని ఆరోపణలని తేల్చి చెప్పారు. ఏయూ వైస్ ఛాన్సలర్ పాల్గోన్నారనే దానికి ఎటువంటి ఆధారాలు లేవన్నారు. ఉల్లంఘన జరిగితే ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందన్నారు.
Hyderabad Job Fraud: ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు.. కట్ చేస్తే ఊహించని ట్విస్ట్
మరోవైపు.. బీజేపీ ఆఫీసులో శివరాత్రి పోస్టింగ్‌పై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ప్లకార్డులుతో నిరసనలో పాల్గోన్న ఎంపీ జీవీఎల్.. శివరాత్రి సందర్భంగా సీఎం జగన్ పెట్టిన పోస్ట్ హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ బీసీ హాస్టల్స్‌లో విద్యార్థులు, పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. హిందువులను కించపరిచే విధంగా ఆ పోస్ట్ ఉందన్నారు. రాష్ట్రంలో ఉన్న హాస్టల్స్ సమస్యలను ముందు పరిష్కారించండని డిమాండ్ చేశారు. సీఎం జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు. వైసీపీ ప్రచారాలు ఆర్భాటాలు మానుకోవాలన్నారు.
