Site icon NTV Telugu

Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవ ఎన్నిక..

Botsa

Botsa

Botsa Satyanarayana: విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, ఏపీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎంపిక అయ్యారు. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగబోతున్నారు. అయితే, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదువులు చేపట్టి బొత్స సత్యనారాయణ రికార్డు సృష్టించారు.

Read Also: kolkata doctor case: కోల్‌కతా డాక్టర్ హత్యచార కేసు.. మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్‌కి సీబీఐ సమన్లు..

అయితే, బొత్స సత్యనారాయణ ఎన్నిక ప్రకటన తర్వాత విశాఖ కలెక్టరేట్‌ దగగర సందడి వాతావరణం కొనసాగుతుంది. జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాత బొత్స మీడియాతో మాట్లాడుతూ.. బీ ఫామ్‌ ఇచ్చి పోటీకి ప్రొత్సహించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్‌​ జగన్‌ మోహన్‌ రెడ్డికి, సహకరించిన జిల్లా నేతలకు ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. ఉమ్మడిగా కలిసి జిల్లా అభివృద్ధికి భాగస్వాములు కావాలి కృషి చేస్తాను అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

Exit mobile version