NTV Telugu Site icon

Botsa Satyanarayana: ఎన్నికలొస్తే.. పగటి వేషాల్లాగా చంద్రబాబు రంగులు మారుస్తాడు

Botsa On Cbn

Botsa On Cbn

Botsa Satyanarayana Reacts On Chandrababu Amit Shah Meeting: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసిన సంగతి తెలిసిందే! ఈ కలయికపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది చర్చించుకుంటున్నారు. ఆ పొత్తు సంగతేమో కానీ, తాజాగా ఈ కలయికపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబుకు ఎన్నికలొస్తే పండగ అని, పగటి వేషాల్లాగా రంగులు మారుస్తాడని ధ్వజమెత్తారు. ఆయన ఏ వేషం వేస్తాడో, ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ అవసరం బీజేపీకి ఉంటే, వాళ్లు వచ్చి కలవాలి కదా? అని ప్రశ్నించారు. అయినా.. టీడీపీ వాళ్లు ఎవరితో పోతే తమకెందుకని తేల్చి చెప్పారు. వాళ్ళు ముగ్గురు కలిసినా, ముప్పై మంది కలిసి పోటీ చేసినా.. తమకొచ్చే నష్టం ఏమీ లేదని పేర్కొన్నారు.

MLA Prasanna Kumar: చంద్రబాబు లాంటి మోసగాడు.. దేశ చరిత్రలోనే ఉండరు

అనంతరం.. ఒడిశా రైలు ప్రమాదానికి సంబంధించి మంత్రి బొత్స మరికొన్ని వివరాలు వెల్లడించారు. మంత్రి అమర్నాథ్ బృందం ఏపీకి చెందిన వారి వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. జనరల్ బోగీలలో ఉన్న డేటా తీసుకోలేదని.. ఆసుపత్రిలో చూసిన తర్వాత పరిస్థితులు తెలుస్తాయని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ఈ ఘటనలో 275 మంది చనిపోయారని ఒరిస్సా ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని వెల్లడించారు. ఏపీకి చెందిన గురుమూర్తి అనే వ్యక్తి ఈ ప్రమాదంలో చనిపోయారని, పింఛన్ తీసుకోవడానికి ఆయన అక్కడికి వెళ్లారని తెలిపారు. ఈ ఘటనలో ఏపీకి చెందిన 22 మంది గాయపడ్డారని తెలిసిందన్నారు. వారిలో ఐదుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, నలుగురు ఏపీకి వస్తున్నారని, మిగిలిన 11 మందికి స్వల్ప గాయాలే కావడంతో ఇంటికి వెళ్లిపోయారని చెప్పారు.

Electronic Interlocking: రైలు దుర్ఘటనకు ఎలక్ట్రానికి ఇంటర్‌లాకింగ్ సిస్టమ్.. అసలేంటీ ఈ సిస్టమ్..?

ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఏపీ నుంచి 50 అంబులెన్స్‌లు వెళ్లాయని.. కటక్, భువనేశ్వర్‌ ప్రాంతాల్లోనూ అంబులెన్స్‌లు ఏర్పాటు చేసామని మంత్రి బొత్స తెలిపారు. అవసరమైన ఎయిర్ లిఫ్ట్ చేయడానికి చాపర్ సిద్ధంగా ఉందన్నారు. 28 మంది ప్రయాణం చేసిన వారు, ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదన్నారు. చనిపోయిన వ్యక్తికి రూ.10 లక్షలు, సీరియస్‌గా ఉన్న వారికి 2 లక్షలు, ట్రీట్మెంట్ పొందుతున్న వారికి ఎక్స్‌గ్రేషియా అందిస్తామన్నారు. 180 మృతదేహాలను ఇంకా గుర్తించాలని, అందులో ఎవరైనా ఉన్నారా? లేదా? అనేది చూడాలన్నారు. కంట్రోల్ రూంకి ఎటువంటి ఫోన్‌లు రాలేదన్న మంత్రి బొత్స.. రెండు రైళ్లలో కలిపి 695 మంది ఏపీ వాళ్ళు రిజర్వేషన్‌లలో ప్రయాణం చేశారన్నారు.

Show comments