Site icon NTV Telugu

Botsa Satyanarayana: మూడు రాజధానులే మా విధానం

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఏపీలో మూడురాజధానులకు కట్టుబడి వున్నామని మరోసారి స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. మూడు రాజధానులు అనేవి మా పార్టీ, ప్రభుత్వ విధానం. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం. సమయాన్ని బట్టి సభలో బిల్లు పెడతాం. మూడు రాజధానుల విధానమే మా నిర్ణయం అన్నారు. మొదటి నుండి అదే చెప్తున్నాం. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే మా లక్ష్యం అని పేర్కొన్నారు.

https://ntvtelugu.com/pvn-madhav-comments-on-smartcity-coporations/

స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? ఏదైనా పాజిటివ్ గా తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయ సమస్యల పై ఎమ్మెల్సీలతో చర్చించాం. అన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కొన్ని సంఘాల వారికి నాలుగో తేదీన రమ్మని చెప్పాం. ఎవరు ఎప్పుడు కోరితే అప్పుడు టైం ఇస్తాం. మున్సిపల్ స్కూల్సులో టీచర్ల సంఖ్య పెంచమని అడిగారు. పీఎఫ్ వంటి సమస్యలు అడిగారు.‌ అన్నీ పరిష్కరిస్తామన్నారు మంత్రి బొత్స. మూడురాజధానుల బిల్లు త్వరలో ప్రవేశపెట్టే పనిలో పడింది ప్రభుత్వం.

Exit mobile version