కొడాలి నానిపై వచ్చిన ఆరోపణలను నిరూపించడానికి సిద్ధమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమహేశ్వరరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం, కొడాలి నాని తీవ్రంగా విమర్శించారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో క్యాసినో నిర్వహించారు. కొడాలి నానిపై మేం చేసిన ఆరోపణలు నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరువు పోయిందని భయపడి.. మమ్మల్ని తిడుతున్నారని బోండా ఉమ ఆరోపించారు. మంత్రి కొడాలి నాని కన్వెన్షన్ సెంటర్లో జరిగినట్లు నిరూపిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ చేశారు. మంత్రి కొడాలి నాని సవాలును స్వీకరిస్తున్నా. మేము నిరూపించడానికి సిద్ధం.. నిరూపించలేకపోతే పెట్రోల్ తో నేను తగల బెట్టుకుంటా..లేకపోతే నీవు పెట్రోల్‌తో తగల బెట్టుకోవాలని బోండా ఉమ అన్నారు.
దీని పై సీఎం జగన్ వెంటనే స్పందించాలి.. క్యాసినో వ్యవహరంపై విచారణ కమిటీ వేయాలన్నారు. జగన్ ఎందుకు స్పందించడం లేదు..? మాపై దాడులు చేస్తే భయపడే ప్రసక్తే లేదు. పక్కా ప్రణాళికతో మాపై దాడి జరిగింది.. చంపాలని చూశారని బోండా ఉమ అన్నారు. నిన్న మా ప్రాణాలు తీయాలని చూశారు.. కుదరలేదు. ఈ వ్యవహారం పై డీఐజీ ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు.టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళితే ప్రభుత్వం ఉల్కిపడుతోందన్నారు. ఏమి జరగకపోతే మమ్మల్ని కన్వెన్షనుకు తీసుకెళ్లి చూపించాలి. నీవు నిజంగా నీతి మంతుడైతే కన్వెన్షన్ సెంటర్లో ఏమి జరగకపోతే ఎందుకు చూపించలేదు. అంటూ కొడాలి నానిపై బోండా ఉమ మండిపడ్డారు.
Read Also: దేశంలో హిందువులకు ముప్పు రాబోతుంది: జీవీఎల్ నరసింహారావు
ప్రస్టేషన్లో ఇష్టం వచ్చినట్లు చంద్రబాబును.. మమ్మల్ని తిడుతున్నారు. ఎప్పుడు పెట్రోలుతో తగల పెట్టుకుంటావు..టీడీపీ నేతలు ఎవరూ అవసరం లేదు. మీడియా, అధికారుల సమక్షంలో నిజ నిర్ధారణ చేయండి. క్యాసినో, అమ్మాయిలతో అసభ్య నృత్యాలు, వ్యభిచారం, జూదం అన్ని జరిగాయని బోండాఉమ ఆరోపించారు.ఈ విషయం మీ పార్టీ ,ప్రభుత్వంలో అందరికి తెలుసు అన్నారు. నీ సవాల్ ను స్వీకరిస్తున్నాం.. టైం డిసైడ్ చేయి. కొడాలి నాని దొరికిన దొంగ. నాకు సమాచారం వచ్చింది.. ఆరు గంటల్లో డిఎస్పీ కి ఫోన్ చేసి ఆపించానని నీవే చెప్పావు. జాన్ విక్టర్, శశి భూషణ్ అమ్మాయిలతో డాన్సులు వేశారు. కరోనా వచ్చి హైదరాబాద్ లో నీవు పడుకుంటే.. తప్పు.. ఒప్పు అయిపోదన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా..? లేదా అని డీజీపీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసులు అనుమతితో గుడివాడకు వెళ్లాం. వైసీపీ వాళ్లే నా కారు పగల గొట్టారు. మాపై హత్యాయత్నం చేశారు.. పోలీసులు ఏం చేస్తున్నారు మమ్మల్ని అరెస్ట్ చేసి..మా కారులు పగల గొట్టించారు. వైసీపీ కండువాలు కప్పుకున్న వారిలా కొందరు పోలీసులు వ్యవహరి స్తున్నారని మండిపడ్డారు.డిఐజి అపాయింట్ మెంట్ అడిగాం.. వదిలి పెట్టే ప్రసక్తే లేదు. కలెక్టరును కూడా కలుస్తాం. ఎవరూ స్పందించకపోతే కోర్టుకు వెళ్తామని బోండా ఉమ అన్నారు.
