ఏపీలో ఇటీవల ఒకే పార్టీకి చెందిన ఇద్దరు రాజకీయ నేతలు వియ్యంకులుగా మారుతున్నారు. ఇటీవల వైసీపీ నేతలు కొలుసు పార్థసారథి, బుర్రా మధుసూదన్ యాదవ్ వియ్యంకులు అయ్యారు. తాజాగా టీడీపీ నేతలు బోండా ఉమా, ఏవీ సుబ్బారెడ్డి కుటుంబాలు కలవబోతున్నాయి. ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతితో బోండా ఉమా కుమారుడు సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. త్వరలో జరగనున్న ఈ కార్యక్రమానికి ఇరువురు నేతలు తమ పిల్లలతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు.
జస్వంతి, సిద్ధార్థ్ ఇద్దరూ అమెరికాలో చదువుకున్నారు. ఎన్నారై టీడీపీ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఈ విషయాన్ని తమ కుటుంబాలలో చెప్పడంతో వాళ్లు పెళ్లికి అంగీకరించారు. పెద్దలు నిశ్చయించిన మేరకు ఈనెల 27న జస్వంతి, సిద్ధార్థ్ నిశ్చితార్థం జరగనుంది. నిశ్చితార్థానికి తాము టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించినట్లు ఏవీ సుబ్బారెడ్డి కుమార్తె జస్వంతి సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.
త్వరలో జరగనున్న మా నిశ్చితార్థం మరియు పెళ్లి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఈరోజు @ncbn గారిని Bonda Siddhartha, మా నాన్న @IamAVSubbaReddy గారు, మామయ్య @Bondauma_MLA గారితో కలిసి ఆహ్వానించడం జరిగింది. pic.twitter.com/NjjqcSt69F
— AV Jashwanthi Reddy (@AvJashwanthi) March 19, 2022
