Site icon NTV Telugu

Bonda Uma: రేపు ఏపీ వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు

Bonda Uma

Bonda Uma

ఏపీలో మహిళలపై జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా ఈనెల 27న బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని టీడీపీ నేత బోండా ఉమ చెప్పారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద ఇటీవల మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ నానాయాగీ చేశారని.. చంద్రబాబు వస్తున్నారని తెలిసి మేకప్ వేసుకుని వచ్చారని బోండా ఉమ ఎద్దేవా చేశారు. మహిళా కమిషన్‌కు లేని పవర్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. పెన్ను, పేపర్ ఉందని నోటీసులు ఇచ్చి.. ఎలా రారో చూస్తామంటూ ఛాలెంజ్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

ఏపీలో మహిళా కమిషన్ ఉన్నది మహిళల హక్కులను కాపాడేందుకా లేదా వైసీపీ హక్కులను కాపాడటానికో తమకు అర్ధం కావడం లేదని బోండా ఉమ వ్యాఖ్యానించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార బాధితురాలికి తాము అండగా నిలవడమే తప్పా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల నేపథ్యంలో బుధవారం నాడు తాము విచారణకు వెళ్లే ప్రసక్తే లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. అత్యాచార ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిసి, బాధితురాలికి సరైన న్యాయం చేయాలని అలాగే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరామన్నారు.

Perni Nani: ప్రశాంత్‌ కిశోర్‌ వ్యాఖ్యలపై పేర్ని నాని కామెంట్స్

Exit mobile version