వైసీపీ పాలన, పోలీసుల తీరుపై మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత బోండా ఉమామహేశ్వరరావు. గత ప్రభుత్వంలో అన్నీ స్పష్టంగా ఉన్నా కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.బాబాయి హత్య కేసును పక్క దారి పట్టించేందుకు సీఐడీతో రిటైర్డ్ అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.వివేకా హత్యపై నిజానిజాలు తేలుతున్న సమయంలో సీఐడీ భాస్కర్ అనే సీమెన్స్ ఉద్యోగిని అరెస్ట్ చేస్తే కోర్టు రిమాండును రిజెక్ట్ చేసింది.రూ. 370 కోట్లు ఎక్కడికి వెళ్ళాయో సీఐడీ తేల్చలేకపోయింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీకి సంబంధం లేదు.ఇది జీఎస్టీ కేసు దీనిపై ఈడి దర్యాప్తు చేస్తోంది.అర్జా శ్రీకాంత్ ఏ ఫైల్ పైనా సంతకం చేయలేదు..?తాడేపల్లి ఆదేశాలను పాటిస్తున్న అధికారులకు కూడా అదే గతి పడుతుంది.స్కిల్ డెవలప్మెంట్ కేసులో పద్ధతి ప్రకారం టీడీపీపై బురద జల్లుతున్నారు . అర్జా శ్రీకాంత్ ను సీసీ కెమెరాలు, న్యాయవాదుల సమక్షంలో విచారణ చేయాలి.ఈ విషయంలో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కోర్టులో నిలబెడతాం. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో తెలంగాణా కోర్టును ఆశ్రయించారు. శ్రీకాంత్ పై థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తే తాట తీస్తాం.
Read Also: Nellore Police: కష్టం ఏపీ పోలీసులది.. ఫలితం తెలంగాణ పోలీసులకి