Site icon NTV Telugu

Bonda Uma : ఇది పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటి

TDP Leader Bonda Uma Made Comments on CM Jagan.

రాష్ట్రంలో పేదలపై 3 ఏళ్లుగా జగన్ రెడ్డి కక్ష సాధిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమా అన్నారు. సంక్షేమం ఇస్తున్నాం కదా అని వారిపై మోయలేని భారం మోపుతున్నారని, పేదలు, మధ్యతరగతిపై అధికంగా విద్యుత్ చార్జీలు పెంచి ధనవంతులపై భారం తగ్గించడం పిచ్చి తుగ్లక్ పాలన కాక మరేంటని ఆయన మండిపడ్డారు. జగనన్న బాదుడే బాదుడు పథకంలో ప్రజలపై రూ.38వేల కోట్ల భారం మోపారంటూ ఆయన వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో బతకలేం అని పేదలు వలస పోయే దుస్థితి నెలకొందని, సంక్షేమ పథకాలు పేదలకు ఎగ్గొట్టేందుకే వారిపై ఎక్కువ విద్యుత్ ఛార్జీల పెంపు భారం మోపారన్నారు. జగన్ రెడ్డి అసమర్థత, అవినీతి వల్లే విద్యుత్ వ్యవస్థ గాడితప్పిందని, ట్రూఅప్ పేరుతో త్వరలో మరో బాదుడుకు జగన్ సిద్ధమయ్యారని విమర్శించారు. మద్యం, ఇసుక, గనులు, ఇతరత్రాల్లో వచ్చే కమీషన్లపై పెట్టిన శ్రద్ధ జగన్ పేదలపై పెట్టలేదని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు.

https://ntvtelugu.com/ktr-fired-on-pm-modi-at-twitter/
Exit mobile version