Site icon NTV Telugu

Bonda Uma: రోజా సొల్లు మాటలు మానుకోవాలి.. ఆమె అలాంటి సినిమాల్లో నటించలేదా?

Bonda Uma Min

Bonda Uma Min

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ ఆర్ధిక సహాయం అందించింది. ఈ మేరకు టీడీపీ నేతలు బోండా ఉమ, వంగలపూడి అనిత బాధిత కుటుంబానికి రూ.5 లక్షల చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా వ్యాఖ్యలకు బోండా ఉమ కౌంటర్ ఇచ్చారు. రోజా సొల్లు మాటలు చెప్పడం మానుకోవాలని.. జగన్ ప్రభుత్వ హయాంలో 800 మంది మహిళలపై దాడులు జరిగితే ఏం చేశారని ప్రశ్నించారు. బ్లూఫిల్మ్‌లలో పాల్గొన్నట్టు స్వయంగా రోజా మీదే అభియోగాలు ఉన్నాయని బోండా ఉమ వ్యాఖ్యానించారు. స్టేజ్ షోల్లో మాట్లాడినట్టు రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. వనజాక్షి, కాల్ మనీ సెక్స్ రాకెట్ అంటూ టీడీపీపై విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలని.. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది.. ఇన్నాళ్లూ ఏం చేశారని నిలదీశారు. వనజాక్షి ఎపిసోడ్‌పై మళ్లీ విచారణ జరిపించాలని.. కాల్ మనీ సెక్స్ రాకెట్టును బయట పెట్టి కేసులు పెట్టిందే టీడీపీ ప్రభుత్వమన్నారు.

విజయవాడ గ్యాంగ్ రేప్ బాధితురాలి కుటుంబానికి టీడీపీ అండగా ఉందని.. అందుకే తమకు నోటీసులు ఇచ్చారని బోండా ఉమా ఆరోపించారు. తనకు పవర్స్‌ ఉన్న చందంగా వాసిరెడ్డి పద్మ ఏదేవో మాట్లాడుతున్నారని.. మహిళా కమిషన్‌కు ఉన్న అధికారాలు వాసిరెడ్డి పద్మ చదివారా అని నిలదీశారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారని బోండా ఉమ అన్నారు. మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని.. ఆమెను ఆ పదవి నుంచి తప్పించాలని సీఎస్, జాతీయ మహిళా కమిషన్‌ను కోరుతున్నామని బోండా ఉమ చెప్పారు. వాసిరెడ్డి పద్మ మేకప్ వేసుకుని తీర్పులు చెప్పొచ్చని అనుకుంటున్నారేమో.. అది కుదరదన్నారు. మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లతో తమ వెంట్రుక కూడా ఊడదన్నారు. చట్టం వాసిరెడ్డి పద్మకే కాదు.. మాకూ చట్టం ఉందన్నారు. మహిళా కమిషన్ చర్యలను ఏ విధంగా ఎదుర్కొవాలో తమకు తెలుసన్నారు.

ఆడబిడ్డ జీవితం విషయంలో వాసిరెడ్డి పద్మ రాజకీయం చేయడం సరికాదని టీడీపీ నేత వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రాజకీయం చేయడానికి చాలా వేదికలున్నాయని.. రాజకీయ కోణంలోనే ఆలోచించే టీడీపీ నేతలకు వాసిరెడ్డి పద్మ నోటీసులిచ్చారని ఆమె ఆరోపించారు. తాము బాధితురాలితో కలిసి మహిళా కమిషన్ కార్యాలయానికి వెళ్తున్నామని.. వాసిరెడ్డి పద్మకు చిత్తశుద్ధి ఉంటే తమతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. కాగా ప్రభుత్వం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుందని బాధితురాలి తల్లి ఆరోపించారు.

Minister Roja: చంద్రబాబు, లోకేష్ చీరలు కట్టుకోవాలి

Exit mobile version