Ayyanna Patrudu House Issue: జగన్.. ఇవాళ నీది.. రేపు మాది.. బోండా ఉమా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చిన వ్యవహారం పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాది గురుపెట్టుకో అంటూ మండిపడ్డారు. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అంటూ హెచ్చరించారు. తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని విమర్శించారు. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక టీడీపీ నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని ఆరోపించారు. ఆ ఓర్వలేనితనంతోనే అయ్యన్న ఇంటి గోడను కూల్చారని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాల్చి చంపుతానని జగన్ ఆనాడు కామెంట్లు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గుట్కా గాడు, కొబ్బరి చిప్పలగాడు మాట్లాడిన మాటలు సంగతేంటీ..? అంటూ ప్రశ్నించారు.
Also Read
- YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
- Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
- Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
కొబ్బరి చిప్పల నాయకుడు వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని నిప్పలు చెరిగారు. ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేసినా మేం తగ్గేది లేదని అన్నారు. రేపట్నుంచి ఇంతకు పదింతలు మాట్లాడతామంటూ పేర్కొన్నారు బోండా ఉమ. 70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు.. ఇది అధికార దుర్వినియోగం కాదా..? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలకు అధికారులు సహకరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చిరించారు బొండా ఉమ.
అయితే నర్సీపట్నంలోని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ఇంటి వద్దకు ఈరోజు తెల్లవారుజామున పెద్దయెత్తున పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వచ్చారు. అయ్యన్న పాత్రుడి ఇంటి గోడను కూల్చారు. పంట కాల్వను ఆక్రమించి అయ్యన్నపాత్రుడు గోడ నిర్మించారని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెందిన రెండు సెంట్ల భూమిని ఆక్రమించి అయ్యన్న గోడ కట్టారని, వాటిని తొలగిస్తున్నట్లు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!