Srisailam: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానంలో ప్రమాదం తప్పింది. అన్నపూర్ణ భవన్‌లో అల్పాహారం తయారీకి ఉపయోగించే బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి బాయిలర్‌లోని ఎస్ఎస్ ట్యాంక్ ఎగిరిపడింది. ఘటనాస్థలిలో సిబ్బంది లేకపోవడంతో ప్రమాదం తప్పింది. నిత్యాన్నదానం నిర్వహించే చోట ఈ ప్రమాదం జరిగింది. స్టీమింగ్ బాయిలర్ బాగా వేడేక్కడంతో పేలిపోయినట్టుగా అక్కడ పనిచేసే సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. ఈ బాయిలర్ పేలుడు కారణంగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దేవస్థానం అధికారులు ప్రమాదం జరిగిన ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్నారు.
Read Also: Rayalaseema JAC: మూడు రాజధానులకు మద్దతుగా కర్నూలులో భారీ ర్యాలీ
అటు కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు రావడంతో ఆలయంలోని కంపార్ట్ మెంట్లు, క్యూలైన్లు నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగుతోంది. దీంతో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు క్యూలైన్లలో వేచి ఉన్న వారికి వేడి పాలు, ప్రసాదం అందించారు. వీటి ఏర్పాట్లకు ఉపయోగించే వంటగదిలోనే మంగళవారం ఉదయం పేలుడు చోటుచేసుకుంది.
Read Also: AP Formation Day Cm Jagan Live: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం లైవ్