Site icon NTV Telugu

Blast in Police Station: పోలీస్‌స్టేషన్‌లో అర్ధరాత్రి భారీ పేలుడు..

Blast

Blast

అర్ధరాత్రి పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడుతో స్థానికులంతా ఉలిక్కిపాడ్డారు.. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ పేలుడు కలకలం సృష్టించింది.. పేలుడు ధాటికి పోలీస్ స్టేషన్ అద్దాలు, తలుపులు, కిటికీలు ధ్వంసం అయ్యాయాయి.. అంతే కాదు.. వివిధ కేసుల్లో పట్టుబడిన కార్లు, బైక్‌లు.. సీజ్‌ చేసిన వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి.. నాటు బాంబు పేలిందా లేక క్వారీలకు వాడే జిల్లెట్స్టిక్స్ ? పేలిందా అనే అనుమానాలు వ్యక్తం కాగా.. చివరకు 2018లో సీజ్‌ చేసిన నల్లమందు పేలినట్టు ఆ తర్వాత తేల్చారు పోలీసులు.. అయితే, అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో… పోలీస్‌స్టేషన్‌ సిబ్బందితో పాటు.. పీఎస్‌ పరిసర ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఏఎస్ఐ ఆంజనేయులు రెడ్డి సహా మరికొందరికి స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుండగా.. పేలుడు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Exit mobile version