దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడంలేదు. రోజువారీ పాజిటీవ్ కేసులతో పాటు మరణాల సంఖ్య సైతం ఆంధోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులతో పాటు ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భయపెడుతున్నాయి. దేశంలో ఇప్పటికే ఈ కేసులు 12 వేలకు పైగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఇప్పటికే ఈ కేసులు 50 కి చేరాయి. బాదితులు కాకినాడలోని జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కరోనా చికిత్స సమయంలో కొలుకోవడానికి అధికమొత్తంలో మెడిసిన్ వాడటం వలన బ్లాక్ ఫంగస్ ఎటాక్ అవుతుందని వైద్యనిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే.
తూర్పుగోదావరి జిల్లాలో పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు…
