Site icon NTV Telugu

GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు

Gvln

Gvln

బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన లిక్కర్ స్కాంలో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి డబ్బులు తరలించారన్నారు జీవీఎల్. వైసీపీకి నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీనే. విజయవాడ ఎయిర్ పోర్టులో రాష్ట్ర ప్రభుత్వమే భద్రత నిర్వహిస్తోంది. ఇప్పటికీ స్థానిక పోలీసులతోనే ఎందుకు భద్రత ఇస్తోంది..? నల్లధనం విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి తరలివెళ్తోందనే ఆరోపణలు గతంలోనూ.. ఇప్పుడూ వస్తున్నాయి. విజయవాడ ఎయిర్ పోర్టులో కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని విమానయాన మంత్రిని అడుగుతాం.

Read Also: Tiger in Asifabad: కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం.. రోడ్డు దాటుతుండగా..

లిక్కర్ స్కామ్ విషయంలో విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి డబ్బులు తరలి వెళ్లాయనే ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ స్కాముకు ఏపీతో సంబంధం ఉందా..? లేదా..? అనేది త్వరలోనే తేలుతుందన్నారు. రూ. 2 వేల నోట్లు తెలుగు రాష్ట్రాల్లో చలామణిలో లేవన్నారు. ఎన్నికల సందర్భంలోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 2 వేల నోట్లు కన్పిస్తున్నాయి.రూ. 2 వేల నోట్లు ఎందుకు ఉండడం లేదో.. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కేంద్రాన్ని అడుగుతాం.టీడీపీ నిరాశపరిచిన గతం.. వైసీపీ భరించలేని ప్రస్తుతం.. బీజేపీ-జనసేన పార్టీలే భవిష్యత్తు అన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని బీజేపీ పడగొడుతుందని పక్క రాష్ట్ర సీఎం ఏదో చెబుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలే కూలగొడతారు.యనమలకూ సీటు లేదని లోకేష్ అంటున్నారు. టీడీపీలో సీనియర్లైన బీసీలకు స్థానం దక్కని పరిస్థితి వుందన్నారు. అన్నమయ్య బ్యారేజ్ కొట్టుకుపోయి ఏడాదైనా పట్టించుకోలేదు. అన్నమయ్య బ్యారేజ్ ప్రాజెక్టు కొట్టుకుపోయినప్పుడు సీఎం జగన్ పొలిటికల్ టూర్ చేసినట్టు చేశారని జీవీఎల్ మండిపడ్డారు.

Read Also: GVL Narasimha Rao: లిక్కర్ స్కాంలో విజయవాడనుంచి డబ్బులు తరలింపు

Exit mobile version