NTV Telugu Site icon

Agnipath: అగ్నిపథ్‌పై కొంత అపోహ..! వాస్తవాలు గ్రహిస్తే సగౌరవంగా ఫీలవుతారు..!

Gvl Narasimha Rao

Gvl Narasimha Rao

ఆర్మీ రిక్రూట్‌మెంట్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ వివాదాస్పదంగా మారింది.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో యువత దీనిపై ఆందోళనకు దిగడం, విధ్వంసానికి పాల్పడడం చర్చగా మారింది.. అయితే, అగ్నిపథ్‌ పథకంపై కొంత మంది యువత అపోహకి గురయ్యారని చెబుతున్నారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్‌ నరసింహారావు.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. త్రివిధ సైనిక బలాల నిర్ణయం మేరకు అగ్నిపథ్ పథకం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పింది… ఈ ఏడాది 46 వేల మందిని నియమిస్తామని కేంద్రం ప్రకటించిందని గుర్తుచేశారు.

Read Also: Harish Rao : మంజీరా నీళ్లు తెచ్చి ఎల్లమ్మ తల్లికి బోనాలు చేసినం

ఇక, భారత జాతీయ భద్రతలో యువతని రిక్రూట్ చెయ్యడమే అగ్నిపథ్ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం అన్నారు ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.. కొంత మంది యువత అగ్నిపథ్‌పై అపోహకి గురయ్యారని.. కొంత మంది రాజకీయ శక్తులు వారిని తప్పుదోవపట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.. అయితే, అగ్నిపథ్‌ పథకంలోని వాస్తవాలు గ్రహిస్తే జాతి నిర్మాణంలో వాళ్లు పోషించే పాత్రపై సగౌరవంగా ఫీలవుతారని స్పష్టం చేశారు. కానీ, ప్రధాని నరేంద్ర మోడీని ఏదోరకంగా అపకీర్తిపాలు చేసేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌పై ఆందోళన కార్యక్రమాలు యువత మానుకోవాలని సూచించారు బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు.