ఏపీని తెలుగుదేశం, వైసీపీలు స్వంత జాగీర్లా చూస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. వైసీపీ ప్లీనరీ, టీడీపీ మహానాడు కుటుంబ పాలనకు అద్దం పడుతుంది.నిస్సిగ్గుగా రెండు పార్టీలకు శాశ్వత అధ్యక్షులుగా ఎన్నుకున్నారు.రాష్ట్రాన్ని టీడీపీ, వైసీపీలు తమ సొంత జాగీరు అన్నట్టుగా మార్చేశాయి.వైసీపీ ప్లీనరీలో మొత్తం అసత్యాలు ప్రస్తావించారు.కేంద్రమిచ్చిన నిధులతో పథకాలకు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నారు.అర్భీకేల నిర్మాణం కేంద్రమిచ్చిన నిధులతో చేస్తున్నారా..? లేదా..?రాష్ట్రంలో పెట్టిన పెట్టుబడులు ఎన్ని.? వచ్చిన పరిశ్రమలు ఎక్కడ..?
పెట్రో కెమికల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ప్రభుత్వం ముందుకు రావడం లేదు.వైజాగ్-చెన్నై, వైజాగ్-హైదరాబాద్, వైజాగ్-కాకినాడ కారిడార్ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంది.పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.కొత్త పోర్టును ప్రభుత్వం ఎందుకు నిర్మాణం చేయలేకపోతుంది.వైజాగులో ఐఐపీయం రాష్ట్ర ప్రభుత్వం కారణంగా వెళ్ళిపోతుంది.మంగళగిరిలో ఎయిమ్స్ కు వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది.అమరావతి నుంచి అనంతపురం వరకు భూసేకరణ చేస్తామని చెప్పి ఇప్పటికే వరకు సేకరించలేదు.
ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పెట్టుబడులు పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నాయి.తెలుగు రాష్ట్రాల్లో మిత వాధ సంస్థలు రెచ్చిపోతున్నాయి.రాష్ట్రంలో పీఎఫ్ఐ ప్రతినిధులు అరాచకాలు చేస్తున్నారు.సిమి సంస్థ ద్వారా రూపాంతరం చెందిన మితవాద సంస్థలు పెరిగిపోతున్నాయి. సామాజిక అంశాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి అశాంతిని సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.14వ తేదీన సివిల్ సప్లైస్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపడతాం అన్నారు పీవీఎన్ మాధవ్.
Buddha Venkanna: వైసీపీ ప్లీనరీపై బుద్దా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు
అమరావతిలో బీజేపీ ఏపీ పదాధికారులు, జిల్లా అధ్యక్షుల సమావేశం జరిగింది. సమావేశంలో సోము వీర్రాజు, పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో వచ్చిన అంశాలపై చర్చించారు.
ఏపీలో కేంద్రం ద్వారానే అభివృద్ధి జరుగుతోందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. నవ రత్నాల అమలు రోజు రోజుకూ తీసికట్టుగా మారుతోంది.అధికార పార్టీ పెట్టుకున్న సమావేశంలో వ్యక్తిగత దూషణలకే పెద్ద పీట వేశారు.సభల్లో వారి నాయకుడిని పొగడడం మిగతా రాజకీయ పక్షాలను తిట్టడాన్ని బీజేపీ ఖండిస్తోంది.రాష్ట్రంలో కొత్త పోకడ కనిపిస్తోంది. కొంతమంది మాట్లాడే భాష దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు.
LIVE: రాజన్న, జగన్ .. పరిపాలనలో ఎవరి ముద్ర వారిదే..