Site icon NTV Telugu

స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై మాట్లాడే హక్కు ఏ పార్టీకిలేదు..!

MLC Madhav

MLC Madhav

విశాఖ ఉక్కు.. ఆంధ్రల హక్కు అంటూ ఓ వైపు పోరాటం జరుగుతున్నా.. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వడివడిగా ముందుకు అడుగులు వేస్తోంది ప్రభుత్వం.. ఈ వ్యవహారంలో అన్ని పార్టీలు కేంద్రంపై విమర్శలు పెంచాయి.. పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధం అవుతున్నాయి. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్.. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడే హక్కు ఏ పార్టీకిలేదన్నారు.. కేవలం రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం స్టీల్ ప్లాంట్ పై ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. ఇక, విశాఖపట్నం మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ముసాయిదా మాస్టర్ ప్లాన్ పై ప్రజలు సంతృప్తిగా లేరన్నారు ఎమ్మెల్సీ మాధవ్.. వీఎంఆర్‌డీఏ రియల్ ఎస్టేట్ సంస్థగానే ఆలోచిస్తోందని ఆరోపించిన ఆయన.. గతంలో వుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ కు ఇప్పుడు ప్రతిపాదించిన ముసాయిదాకు లింకు లేదన్నారు.

Exit mobile version