ఏపీలో అమరావతి పాలిటిక్స్ నడుస్తున్నాయి.. అమరావతి ముద్దు-మూడురాజధానులు వద్దని టీడీపీ, అమరావతి రైతు సంఘాలు, ఇతర పార్టీలు అంటుంటే… అమరావతి వద్దు- వికేంద్రీకరణ ముద్దు అంటోంది అధికార పార్టీ వైసీపీ. ఈ నేపథ్యంలో అటు టీడీపీ, ఇటు వైసీపీలపై మండిపడుతుంది బీజేపీ. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కామెంట్లు చేశారు. రాజధాని భావోద్వేగాలు రెచ్చగొట్టి టీడీపీ, వైసీపీలు చలిమంటలు కాచుకుంటున్నాయి.. ఎన్నికల వరకు కొనసాగించాలనే ఉద్దేశ్యంతోనే రాజధానిపై రాజకీయ చర్చకు జగన్ తెరలేపారని ఆరోపించారు.
వివాదాస్పద అంశాలను రాజకీయాలు చేయాలనేది సీఎం ఆలోచన అన్నారు సోము వీర్రాజు. మోసం చేసే పార్టీలను నిలబెట్టే బాధ్యత బీజేపీ తీసుకుంది.. రాజధాని గురించి మాట్లాడే అర్హత రెండు పార్టీలకు లేదన్నారు. దసపల్లా భూముల దందా తప్ప విశాఖ అభివృద్ధికి ఏమి చేశారో చెప్పాలి. వంశధారకు 200కోట్లు తెచ్చుకునే దమ్ములేని ధర్మాన రాజీనామాలు చేస్తాడా…? విజయనగరంలో ఫ్యాక్టరీలు మూటపడితే బొత్స ఏం చేస్తున్నారు…!? 50ఏళ్ల డిమాండ్ అయిన రైల్వేజోన్ ప్రకటిస్తే దానిపైన రాజకీయం చేస్తున్నారన్నారు సోము వీర్రాజు.
Read Also: Mulayam Singh Yadav: రెజ్లింగ్ నుంచి రాజకీయాల్లోకి.. మూడు సార్లు ముఖ్యమంత్రిగా..
ఇటు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. అమరావతి రైతులను, రాష్ట్ర ప్రజలను వైసీపీ, టీడీపీ వంచిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ కు చేస్తున్న మోసం గురించి జగన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడరు….? బీ.ఆర్.ఎస్.తో ఉన్న లాలూచీ ఏమిటో వైసీపీ,టీడీపీ చెప్పాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీలకు ఓపెన్ ఛాలెంజ్ విసిరారు జీవీఎల్. విశాఖ అభివృద్ధిపై టీడీపీ, వైసీపీ లు బహిరంగ వేదికపై చర్చకు రావాలి. శ్వేతపత్రం విడుదల చేసి వాస్తవాలు బయటపెట్టాలన్నారు. టీడీపీ, వైసీపీ లకు వాటి స్వశక్తి పై నమ్మకం లేదు.బీజేపీ తో వాళ్ళకేదో అవినాభావ సంబంధం ఉందంటూ స్టోరీ లను ప్రచారం చేస్తున్నారు. ఇవి తప్పుడు ప్రచారాలు మాత్రమే. ఈ రెండింటి కి ప్రత్యామ్నాయమే బీజేపీ అన్నారు జీవీఎల్..
ఇటు బీజేపీ నేత టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై సోము వీర్రాజు స్పందించారు. టీజీ వెంకటేష్ ఆవేదనను పార్టీ అర్దం చేసుకుంది. రాయలసీమ వెనకబాటుతనాన్ని అంగీకరిస్తాం. దాని అభివృద్ధి కి బీజేపీ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. వైసీపీ, టీడీపీలు నాగరాజ్, సర్పరాజ్ లు.. విశాఖ భూములపై ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగింది. దశపల్ల భూముల విచారణకు ప్రత్యేక బృందం వేసి….సుప్రీం కోర్టులో రివిజన్ పిటీషన్ వెయ్యాలి…గతంలో టీటీడీ భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివిజన్ పిటీషన్ వేసి విజయం సాధించారు. దసపల్లా విషయంలో ఈ విధంగానే వ్యవహరించాలని సీఎంకు లేఖ రాశాను.
Read Also: Winter Health Tips: చిక్కుల్లేని చలికాలం కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి