VishnuKumar Raju: భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల్లో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ సంకేతాలు పంపింది. టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లో కలబోమని మరోసారి కేంద్ర నాయకత్వం స్పష్టం చేయనున్నట్లు సమాచారం. జనసేన పొత్తులో ఉంటే మంచిది.. లేకున్నా మంచిది అనే సంకేతాలు ఇవ్వబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఒంటరి పోరుకు సిద్ధ పడాలని రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర పార్టీ డైరెక్షన్ ఇవ్వనుంది. పొత్తుపై కేంద్ర నాయకత్వ సందేశాన్ని ఈ సమావేశంలో కేంద్రమంత్రి మురళీధరరావు వెల్లడించనున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదన్న ఉద్దేశంతో టీడీపీతో పొత్తుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుండగా.. ఆ రెండు పార్టీలతో కలిసి వెళ్లేందుకు బీజేపీ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి కన్నా లక్ష్మీనారాయణ వర్గం దూరంగా ఉంది. గత రెండు రోజులుగా కన్నా హైదరాబాద్‌లోనే మకాం వేశారు.
Read Also: Ramcharitmanas row: ఆ నేత నాలుక తీసుకొస్తే రూ.51,000 రివార్డు.. హిందూ మహాసభ ప్రకటన
అటు రాబోయే ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికలకు సంబంధించి ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వైసీపీ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్ విశాఖ వస్తే ఆయన్ను తానే కలుస్తానని విష్ణుకుమార్ రాజు అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. తమ అభిప్రాయం కూడా అదేనని తెలిపారు.