జవడేకర్ సంచలన వ్యాఖ్యలు.. బెయిల్‌పై ఉన్న ఏపీ నేతలు జైలుకే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవడేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చాలా మంది నేతలు బెయిల్‌పై ఉన్నారని.. త్వరలో వారు మళ్లీ జైలుకు వెళ్లే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాగ్రహ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన… ఏపీలోని కొందరు నేతలు బెయిలుపై ఉన్నారు.. త్వరలో జైలుకెళ్లే అవకాశం లేకపోలేదు అంటూ కామెంట్లు చేసి ఒక్కసారిగా రాజకీయాల్లో హీట్ పెంచారు… ఇక, నిధులు కేంద్రానివి.. స్టిక్కర్లు రాష్ట్రానివి.. ఏపీలో ఇది విచిత్రమైన పరిస్థితి ఉందని ఎద్దేవా చేసిన ఆయన.. రూ. 1.60 లక్షలను పీఎంఏవై కింద ఇస్తే జగనన్న కాలనీలంటున్నారు. అవి జగనన్న కాలనీలు కాదు.. మోడీ కాలనీలన్నారు.. సమగ్ర శిక్షాభియాన్ ద్వారా యూనిఫాములను కేంద్రం ఇస్తుంటే జగనన్న కానుక అనే స్టిక్కర్ అంటించారని మండిపడ్డ ఆయన.. వైద్యారోగ్య నిధులను కూడా కేంద్రమే ఇస్తున్నా.. జగన్ స్టిక్కర్లు అంటిస్తున్నారని విమర్శించారు.. ఏపీలో జరిగే అభివృద్ధి కార్యక్రమం కేంద్ర నిధులతోనే జరుగుతోందని స్పష్టం చేశారు.
తన ఉపన్యాసంలో పుష్ప సినిమాను గుర్తుచేసుకున్నారు ప్రకాష్ జవడేకర్.. ఎర్రచందనం స్మగ్లింగ్ పై పుష్ప సినిమాలో చూపించారు.. ఏపీలో అలాంటి పరిస్థితే ఉందన్నారు.. ఏపీలో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోన్నా సిట్‌ను ఎత్తేశారని మండిపడ్డ ఆయన.. వృద్ధాప్య ఫించన్లను నేరుగా వేయకుండా వలంటీర్ల ద్వారా ఇస్తున్నారని.. కానీ, మేం అవినీతిని అరికట్టేందుకు డీబీటీల ద్వారా నగదును అందిస్తున్నాం అన్నారు. ఏపీకి మంచి ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది.. ఏపీ ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వాలి.. ప్రజలు దీవిస్తే ఏపీలో బీజేపీ పెద్ద పార్టీ అవుతుందని విజ్ఞప్తి చేశారు. ఇక, ఏపీ అంటే నాకు ప్రేమ.. ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించాను అని గత అనుభవానులు గుర్తుచేసుకున్న జవడేకర్.. ఆంధ్ర భోజనం అంటే చాలా ఇష్టం అన్నారు.
Also Read
- Thalliki Vandanam Scheme: ‘తల్లికి వందనం’పై గుడ్‌న్యూస్.. అధికారులకు మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు
- YS Jagan: ప్రతి ఓటును కాపాడుకోవాలి.. వైసీపీ నేతలకు జగన్ దిశానిర్దేశం
- AP PECET-2026 ఫలితాలు విడుదల.. 89.76 శాతం ఉత్తీర్ణత
- CM Chandrababu: స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో ముందుకు ఏపీ.. సింగపూర్‌లో చంద్రబాబు కీలక ప్రసంగం
రికార్డు టైంలో పోలవారినికి అనుమతి
పోలవరానికి రికార్డు టైంలో ఒక నెలలోనే పర్యావరణ అనుమతులు ఇచ్చానని.. తాను కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే ఇది జరిగిందన్నారు జవడేకర్… నేను నెలలో అనుమతులిస్తే.. ఇప్పటి వరకు చంద్రబాబు, జగన్ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారన్న ఆయన.. అమరావతి రాజధాని కోసం అటవీ భూములకు అనుమతులిచ్చాం.. కానీ, దురదృష్టకరం.. రాజధాని విషయంలో రెండూ పార్టీలు పోట్లాడుకుంటున్నాయని మండిపడ్డారు.. వైసీపీ, టీఆర్ఎస్, టీడీపీల ప్రభుత్వాలు మూడూ అవినీతి పార్టీలేనని ఆరోపించిన ఆయన.. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఇక, భారతదేశం నుంచి వచ్చామని విదేశాల్లో చెబితే సెల్యూట్ చేస్తున్నారు.. ఏపీ నుంచి వచ్చామని ధైర్యంగా చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ఛార్‌ధామ్ అభివృద్ది చేస్తున్నాం.. సౌకర్యాలు కల్పిస్తున్నాం.. కాశీని అభివృద్ధి చేస్తున్నాం.. అయోధ్యలో రామ మందిరం నిర్మిస్తున్నాం.. కానీ, ఏపీలో విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారు.. రథాలు తగుల పెడుతున్నారు.. దేశంలో నిర్మాణత్మకంగా వెళ్తుంటే.. ఏపీలో విధ్వంసం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మోడీ కారణంగానే టీడీపీ గెలిచింది..
2014 సాధారణ ఎన్నికల్లో నరేంద్ర మోడీ కారణంగానే ఏపీలో టీడీపీ గెలిచిందన్నారు ప్రకాష్ జవడేకర్.. టీడీపీ అధికారంలో వచ్చిన తొలి రెండేళ్లు బాగానే ఉన్నారు.. కానీ, ఆ తర్వాత బీజేపీని.. మోడీని అనరాని మాటలు అన్నారని.. అందుకే 2019లో టీడీపీ ఓడిపోయిందన్నారు. ఇక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మద్య నిషేధం అన్నారు.. కానీ, ఇప్పుడు మద్యం అమ్ముతున్నారన్న ఆయన.. పోలీసులను, టీచర్లను రిక్రూట్ చేస్తామన్నారు.. కానీ గాలికొదిలేశారని విమర్శలు గుప్పించారు.. రైతుల పంటల బీమా ప్రిమీయం కడతానన్న జగన్.. మాట తప్పారు.. జగన్ మాట తప్పి అందర్నీ ఇబ్బందుల్లోకి నెట్టారని వ్యాఖ్యానించారు ప్రకాష్ జవడేకర్.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: సూపర్ ఓవర్ వివాదం తర్వాత వైభవ్‌కు మరో అవకాశం.. మళ్లీ బేబీ బాస్‌పైనే అందరి కళ్లు..!
-
Air India: తక్కువ ధరకే విమాన ప్రయాణం.. కొత్త ప్లాన్ ప్రవేశపెట్టిన ఎయిర్ ఇండియా.. ఓ లుక్కేయండి..
-
Sonam Raghuvanshi: ఆ వార్తలు అబద్ధం.. హనీమూన్ నిందితురాలు సోనమ్ సంచలన ఇంటర్వ్యూ
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌తో గొడవకు దిగిన ఆటగాడి తిక్క కుదిర్చిన శ్రీలంక బోర్డు.. సూర్యవంశీతో పెట్టుకుంటే అంతే మరి..
-
Jaypee Associates: సున్నాకి పడిపోయిన ఆ కంపెనీ షేర్ వాల్యూ.. రోడ్డున పడిన 6 లక్షల మంది ఇన్వెస్టర్లు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?