NTV Telugu Site icon

బద్వేల్‌లో నైతిక విజయం బీజేపీదే.. ఓటు బ్యాంక్‌ గణనీయంగా పెరిగింది..

kannaa

ఏపీలోని బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఉప ఎన్నిక‌లో వైసీపీ గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గ‌ల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొద‌టి రౌండ్ నుంచి ఏక‌ప‌క్షంగా ఫ‌లితాల‌ను న‌మోదు చేసి ఘ‌న విజ‌యం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాస‌రి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి క‌మ‌లమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు పోల్‌ అయ్యాయి.. కాగా, డిపాజిట్‌ గల్లంతు అయినా.. బీజేపీ ఓటింగ్‌ మాత్రం గణనీయంగా పెరిగిందంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆ పార్టీ నేతలు..

బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితంపై స్పందించిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు… ఇక, బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగింది.. బద్వేల్‌ ఉప ఎన్నిక‌ బీజేపీ కార్యకర్తలకు‌ మనోధైర్యాన్ని ఇచ్చిందని వెల్లడించారు.. బద్వేల్‌ సీఎం వైఎస్‌ జగన్‌ సొంత జిల్లాలో ఉంది… అక్కడ అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపించిన ఆయన.. వైసీపీకి‌ ఓటెయ్యకపోతే సంక్షేమ పథకాలుని లిపివేస్తామని బెదిరించారని.. బద్వేల్‌ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదన్నారు. ఈ ఎన్నికలో నైతిక విజయం బీజేపీదేనన్న ఆయన.. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.. బీజేపీ ఓటు బ్యాంక్ గణనీయంగా పెరిగిందని.. 2024 ఎన్నికలకు బీజేపీ ప్రధాన పార్టీగా అవతరిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు కన్నా లక్ష్మీనారాయణ.