Site icon NTV Telugu

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడికీ పోదు-బీజేపీ నేత కన్నా

ఓవైపు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ వైపు కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తుంటే.. మరోవైపు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ సాధించుకున్న స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం కానివ్వం అంటూ కార్మిక సంఘాలు ఉద్యమాలు చేస్తున్నాయి.. కార్మికుల ఆందోళనకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి.. అయితే, స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై స్పందించిన కన్నా లక్ష్మీనారాయణ.. ప్రభుత్వం పాలన మాత్రమే చేయాలి.. వ్యాపారం చెయ్యకూడదన్నది ప్రధాని నరేంద్ర మోడీ పాలసీగా చెప్పుకొచ్చారు.. అందుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తున్నారన్న ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్కడకు పోదు… యాజమాన్యం మాత్రమే మారుతుంది అని వ్యాఖ్యానించారు. ఇక, ఉద్యోగులు భద్రత గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు కన్నా లక్ష్మీనారాయణ.. ఉద్యోగుల భద్రతపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ప్రకటించారు.

Exit mobile version