NTV Telugu Site icon

Bhanu Prakash Reddy: ఏపీలో చర్చిల నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి

Bhanu Prakash Reddy

Bhanu Prakash Reddy

Bhanu Prakash Reddy: తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ప్రభుత్వం క్రీస్తుప్రదేశ్‌గా మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా రిసిప్ట్‌పై క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ మౌనమునిలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలు దూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు.

Read Also: Telugu Desam Party: కొవ్వూరులో తమ్ముళ్ళ కీచులాటలు.. టీడీపీకి ఇదేం ఖర్మ?

ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం చర్చిల అభివృద్ధికి రూ.175 కోట్లు విడుదల చేయడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అయ్యప్ప దీక్షలో ఉండి ఆయన చేస్తున్న పనులతో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ బోర్డు సభ్యులు సంజీవయ్య శిలువను మోస్తున్నారని.. ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని అనుమానంగా ఉందన్నారు. వైజాగ్, నెల్లూరు సంఘటనలపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భానుప్రకాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీలో చర్చిల నిర్మాణంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.

Read Also: Pavitra Lokesh: బ్రేకింగ్.. పోలీస్ స్టేషన్ లో పవిత్ర.. వారిపై ఫిర్యాదు