Site icon NTV Telugu

ఏపీలో ఖజానా ఖాళీ అయ్యి.. ప్రభుత్వం దివాళా తీసింది : అరుణ్ సింగ్

ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి అరుణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 1న జీతం రావడం లేదు.. పింఛన్ ఇవ్వడం లేదు.. ఏపీ లో ఖజానా ఖాళీ అయింది…ప్రభుత్వం దివాళా తీసింది అంటూ ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. మద్యం, ఇసుక మాఫియా కారణంగా ఖజానా ఖాళీ అయిందని, ఏపీ ప్రభుత్వం పీఆర్సీ ద్వారా వేతనం పెంచకుండా తగ్గించిందని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా అధికారం ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.

ఏపీలో బుజ్జగింపు, ఓటు బ్యాంకు రాజకీయాలు మానకుంటే ఇబ్బందులు తప్పవని, అఖిలేష్ హయాంలో యూపీ మంత్రి అజాం ఖాన్ చాలా ఏళ్లుగా జైలులో వున్నారని, ఎన్ని నేరాలు చేసినా ముస్లింలపై చర్యలు తీసుకోరాదన్న ఫలితమే యూపీ మంత్రి అజాం ఖాన్ జైలులోనే వున్నారన్నారు. సీఎం జగన్ ను హెచ్చరిస్తున్నా.. బీజేపీ కార్యకర్తలపై దౌర్జన్యాలను అడ్డుకునేందుకు అండగా ఉంటామని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యకర్తలకు అన్యాయం చేస్తే సహించమని, వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన కేసులు ఉపసంహరించాలన్నారు.

Exit mobile version