Site icon NTV Telugu

తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేదు: పవన్‌ కళ్యాణ్‌


విజయనగరం జిల్లా లచ్చయ్య పేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం వద్ద బకాయిల కోసం నెల రోజులుగా దీక్ష చేస్తున్న, ప్రభుత్వం పట్టించు కోకపోవడంతోనే ఆందోళ ఎక్కువైందని జనసేన అధినేత పవన్‌ కళ్యా ణ్‌ అన్నారు. ఈ సందర్భంగా పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ గత రెండేళ్ల లో ఆ కర్మాగారం నుంచి రైతులకు రావాల్సిన రూ.16.38 కోట్ల బకా యిలను ఇప్పించేలా చూడాల్సిన పాలనా యంత్రాంగం ఈ సమస్య ను శాంతి భద్రతల సమస్యగా చూడటం సరైంది కాదన్నారు. తీపిని పంచే చెరకు రైతుల జీవితాల్లో చేడు నిండుతోందని పవన్‌ కళ్యాణ్‌ ఆరోపించారు.

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆందోళన చేస్తున్న రైతులు పోలీస్‌ స్టేషన్ల చూట్టు తిరగుతున్నారన్నారు. మరో వైపున రాజకీయ ఒత్తిళ్లతో పోలీ సులు నలిగిపోతున్నారన్నారు. రెండేళ్ల నుంచి రావాల్సిన బకా యిలను ఇప్పించాల్సిన ప్రభుత్వం జనవరిలో ఇచ్చేలా యజ మాన్యాన్ని ఒప్పిస్తాననడం రైతులను మోసం చేయడమే అవుతుం దన్నారు. ఈ సమస్యకు పరిష్కారం లభించే వరకు జనసేన నాయకులు రైతులకు అండగా ఉంటారని పేర్కొన్నారు.

గత రెండు సీజన్ల నుంచి రాష్ర్ట వ్యాప్తంగా చెరుకు రైతులకు రూ.90 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని పవన్ కళ్యాణ్‌ తెలిపారు. రైతుల కు చక్కెర కర్మాగారాల నుంచి రావాల్సిన బకాయిలు వచ్చేలా ప్రభు త్వం, అధికారులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 15 రోజు ల్లోనే రైతులకు డబ్బులు వచ్చేలా చూడాల్సిన ప్రభుత్వం రెండు సీజన్లుగా బకాయిలను చెల్లించని కర్మాగారాలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు.

Exit mobile version