NTV Telugu Site icon

టీకా వేయించుకుంటే ఏపీలో బిర్యానీ…గుజ‌రాత్ ముక్కుపుడ‌క ఫ్రీ…

క‌రోనా మ‌హమ్మారి కోర‌లు చాస్తోంది.  క‌రోనా కార‌ణంగా ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎద‌రుర్కొంటున్నారు.  క‌రోనా మ‌హమ్మారి నుంచి బ‌య‌ట ప‌డేందుకు టీకాల‌ను అందిస్తున్నారు.  అయితే, టీకా తీసుకోవ‌డానికి ప్ర‌జ‌లు వెన‌కాడుతున్నారు.  టీకా తీసుకుంటే ఆరోగ్య‌ప‌ర‌మైన ఇబ్బందులు వ‌స్తాయిని, టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయ‌ని చెప్పి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.  అమెరికా నుంచి ఇండియా వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో ఇదేవిధ‌మైన భ‌యాలు ఉన్నాయి.  ప్ర‌జ‌ల‌ను ఎంక‌రేజ్ చేసేందుకు ఎక్క‌డిక‌క్క‌డ తాయిలాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.  అమెరికాలో ఈ తాయిలాలు అధికం.  ఇండియాలో కూడా కొన్నిచోట్ల ఇలాంటి తాయిలాల‌ను ప్ర‌క‌టిస్తున్నారు.  ఏపీలోని విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఓ కంపెనీ టీకా తీసుకున్న‌వారికి బిర్యానీ ఫ్రీగా ఇస్తుండ‌గా, గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో టీకా వేయించుకున్న మ‌హిళల‌కు బంగారు ముక్కుపుడ‌క ఫ్రీగా ఇస్తామ‌ని అక్క‌డి వ్యాపారులు ప్ర‌క‌టించారు.