NTV Telugu Site icon

Bhumana Karunakar Reddy: అమరావతి రాజధానిని జగన్‌ సమర్ధించలేదు..!

Bhumana Karunakar Reddy

Bhumana Karunakar Reddy

అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్‌యలు చేశారు.. రాజధానిగా అమరావతి వైఎస్‌ జగన్‌ సమర్ధించలేదన్నారు.. మూడు రాజధానులపై సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ.. ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో రాయలసీమ ఆత్మగౌరవ మహా ప్రదర్శన నిర్వహించారు.. ర్యాలీ ప్రారంభానికి ముందు భూమనపై పూల వర్షం కురిపించారు.. మూడు రాజధానులు, రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గుండె చప్పుడు వినిపిస్తూ మహా ప్రదర్శన జరిగింది.. స్థానిక కృష్ణాపురం ఠాణా వద్ద నుంచి ప్రారంభమైన మహా ప్రదర్శన.. గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు మీదుగా నగర పాలక సంస్థ కార్యాలయం వరకు కొనసాగింది.. అనంతరం తిరుపతి మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలనాడి తెలుసుకోకుండా మూడు రాజధానులకు వ్యతిరేకంగా చేసిన విషప్రచారాన్ని తిరుపతి ప్రజలు తిప్పి కొట్టారని తెలిపారు.

Read Also: misbehaviour with students: నిట్‌లో కీచకపర్వం..! విద్యార్థినులతో వెకిలిచేష్టలు..

ఇక, చంద్రబాబు గుండెల్లో నిద్రపోయేలా తిరుపతి సీమ ఆత్మ గౌరవ సభ జరిగిందన్నారు భూమన.. సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయాన్ని స్వాగతిస్తూ తిరుపతి ప్రజలవాణి సీమ ఆత్మ గౌరవ సభ వినిపించిందన్నారు.. ఈ గడ్డపై పుట్టిన చంద్రబాబు సీమకు అన్యాయం చేశారని ఆరోపించిన ఆయన.. సొంత మామకు.. గద్దెను ఎక్కించిన సీమకు ఆయన వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు.. పోతిరెడ్డిపాడుకు పెంచిన కృష్ణాజలాలు రాకుండా చంద్రబాబు అడ్డుకున్నారని విమర్శించారు.. మరోవైపు.. అమరావతి రాజధాని కావాలని జగన్‌ సమర్ధించలేదు.. అందుకే రాజధాని శంకుస్థాపనకు దూరంగా ఉన్నారని తెలిపారు.. అయితే, శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉంటానని ఆనాడే వైఎస్‌ జగన్‌ చెప్పారని గుర్తుచేశారు వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి..