అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా భోగి వేడుకలు జరిగాయి. భోగి ప్రతి ఇంట భోగభాగ్యాలు కలిగించాలని కోరుతూ భక్తి పార్వసంగా సంబరాలు జరిగాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ప్రారంభించారు. తెలుగువారి సాంస్కృతి సాంప్రదాయాలను చాటి చెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామిని దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అనే నినాదంతో ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం.. గోవింద నామస్మరణతో భారీ ఎత్తున భోగి పిడకల దండను భోగిమంటలో ఆలయ సిబ్బంది వేసింది. వైభవోపేతంగా భోగి వేడుకలు కొనసాగాయి.
Read Also: Pakistan : బలూచిస్థాన్‌లో ఎన్‌కౌంటర్.. ఐదుగురు సైనికులు, ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఇక, ఈ ఉదయం నుంచి గోదాదేవి కళ్యాణం జరుగుతుంది. భక్తులు భారీగా తరలివస్తున్నారు. కోనసీమ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు సందడిగా కొనసాగుతున్నాయి. మూడు రోజులు పాటు ఈ వేడుకలు ఆనందసహంగా జరగనున్నాయి. తొలి రోజు ఊరు వాడ వెలిసిన భోగి మంటలు.. జిల్లా వ్యాప్తంగా అతి అత్యధికంగా ఉన్న చలి తీవ్రత నమోదు అవుతుంది. దీంతో తెల్లవారు జామున వేసిన భోగి మంటల్లో ప్రజలు సేద తీరుతున్నారు. ఇక, వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో భోగి వేడుకలకు తెలుగు రాష్ట్రాల నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.