Bode Ramachandra Yadav: బీసీ హక్కుల కోసం మంగళగిరిలో మహా పోరాటం.. రామచంద్ర యాదవ్ ఆమరణ దీక్ష
- మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభం
- బీసీ హక్కుల కోసం రామచంద్ర యాదవ్ పోరాటం
- జాతీయ స్థాయి నేతల మద్దతు వెల్లువ
- ఐదు డిమాండ్లపై ప్రభుత్వ స్పందన కోరుతూ నిరసన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ సామాజిక వర్గాల సమగ్ర అభ్యున్నతే ధ్యేయంగా భారత చైతన్య యువజన (బీసీవై) పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ మంగళగిరిలో ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయ ఆవరణలో ప్రారంభమైన ఈ ‘ధర్మ దీక్ష’కు రాష్ట్రవ్యాప్తంగా వివిధ బీసీ సంఘాల నాయకులు, మేధావులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సంఘీభావాన్ని ప్రకటించారు. గతంలో నిర్వహించిన “బీసీ సింహగర్జన” సభలో ఐదు కీలక డిమాండ్లను ప్రస్తావించిన రామచంద్ర యాదవ్, వాటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే ఈ నిరసన బాట పట్టినట్లు స్పష్టం చేశారు. అణగారిన వర్గాల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తానని, బీసీల సమస్యల పరిష్కారం అయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని ఆయన ఈ సందర్భంగా భీష్మించుకున్నారు.

Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
Home Minister Vangalapudi Anitha: ఆపరేషన్ ట్రేస్‌లో 900 పిల్లలను రక్షించాం..
రామచంద్ర యాదవ్ చేపట్టిన ఈ పోరాటానికి జాతీయ స్థాయిలోనూ భారీ మద్దతు లభించింది. ఓబీసీ రిజర్వేషన్ల కోసం చారిత్రాత్మక పోరాటం చేసిన బీపీ మండల్ మనుమడు డా. సూరజ్ మండల్ స్వయంగా హాజరై ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు జ్యోతిబా పూలే మనుమరాలు డా. ఎస్. పూలే కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రామచంద్ర యాదవ్ చేస్తున్న పోరాటాన్ని అభినందించారు. బీసీలందరూ ఏకతాటిపైకి వచ్చి రాజ్యాధికారాన్ని సాధించినప్పుడే సామాజిక సమన్యాయం జరుగుతుందని, అణగారిన వర్గాల గొంతుకగా నిలుస్తున్న ఈ దీక్షకు తాము ఎల్లవేళలా అండగా ఉంటామని వారు వ్యాఖ్యానించారు. బీసీల చైతన్యమే లక్ష్యంగా సాగుతున్న ఈ దీక్ష ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపుతోంది.
Rilee Rossouw: “ఐపీఎల్ ఒక సినిమా డ్రామా”.. IPL కంటే PSL గ్రేట్ అంటూ రోసో పిచ్చి కూతలు..
తాజావార్తలు
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
-
Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!