Site icon NTV Telugu

AP Cabinet Expansion : బీసీ, ఎస్సీ వర్గాలపై వైసీపీ ఫోకస్

ఏపీ మంత్రి వర్గాన్ని విస్తరించనున్నట్లు ఇటీవల సీఎం జగన్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆశవాహులు మంత్రి వర్గంలో చోటు దక్కించుకునేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీసీ, ఎస్సీ వర్గాల పై వైసీపీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కొత్త క్యాబినెట్‌లో బీసీ, ఎస్సీ వర్గాలకు ప్రాధాన్యత పెరుగనుంది. ఈ క్రమంలో కాసేపట్లో బీసీ మంత్రుల కీలక సమావేశం నిర్వహించనున్నారు. క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు భేటీ బీసీ మంత్రులు కానున్నారు.

బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, చెల్లుబోయిన వేణుగోపాల్, సిదిరి అప్పలరాజు, ధర్మాన కృష్ణదాస్, అనీల్ యాదవ్, శంకర్ నారాయణలు హజరుకానున్నారు. వీరితో పాటు ప్రభుత్వ సలహాదారు సజ్జల, సీఎంఓ అధికారులు కూడా హజరుకానుండటం విశేషం. జిల్లాల వారీగా బీసీ వర్గాలతో భారీ ఎత్తున సభలు నిర్వహించే ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు.

Exit mobile version